(Local) Tue, 02 Mar, 2021

సాహో లో శ్రద్ధాకపూర్ పారితోషికం ఎంతో తెలుసా ...

August 07, 2019,   9:20 PM IST
Share on:
సాహో లో  శ్రద్ధాకపూర్ పారితోషికం ఎంతో తెలుసా ...

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన సినిమా ’సాహోలో హీరో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్ రూ.5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల కానుంది. నాలుగు భాషల్లో విడుదలయ్యే సినిమా కావడం వల్లనే శ్రద్ధాకపూర్ భారీ మొత్తంలో పారితోషికం అందుకుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాజల్, తమన్నా, త్రిష వంటి సీనియర్ హీరోయిన్లు ప్రతి సినిమాకి సుమారు రూ.2 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయన తార మాత్రం ప్రతి సినిమాకు రూ.4 కోట్ల వరకు తీసుకుంటున్నారు.  మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇస్తోన్న అలనాటి అందాల తార విజయశాంతి 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాహో బహుబాషా చిత్రం కావడం వల్లనే శ్రద్ధాకపూర్ భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్టు ఆమె అభిమానులు చెబుతున్నారు.

Actress Shraddha Kapoor Took Huge Remuneration

 

సంబంధిత వర్గం
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్‌...వెంటిలేటర్‌పై చిక ...
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్‌...వెంటిలేటర్‌పై చిక ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.