(Local) Fri, 07 May, 2021

మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...

September 16, 2019,   3:21 PM IST
Share on:
మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...

ఈ మధ్య సినిమాలలో నటించే స్టార్స్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కెరీర్ పరంగా కూడా చాల శ్రద్ద వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కొందరు స్టార్స్ సినిమాలు మాత్రమే కాకుండా వ్యాపారాలు కూడా మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. ఆ కోవలోనే ఓ పంజాబీ భామ పయనిస్తోంది. దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సిద్ధాంతాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాగా ఒంటబట్టించుకున్నట్టుంది. అటు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఇటు వ్యాపారాలు చక్కదిద్దుకుంటోంది. సినిమాలు సినిమాలే, వ్యాపారం వ్యాపారమే అన్నట్టుగా.. ముందు నుండి రకుల్ ప్రీత్ ప్లానింగ్ వేరు. మొదటునుండి బాడీ వర్కౌట్స్ విషయంలో చాలా స్ట్రిట్ గా ఉండే రకుల్ F45 అంటూ జిమ్ సెంటర్స్ ని ఓపెన్ చేసింది. రకుల్ జిమ్ వ్యాపారం చాలా నగరాల్లో పాపులర్ అయ్యింది. ఇక తాజాగా సినిమా అవకాశాలు కూడా తగ్గిన రకుల్ మరో వ్యాపారంలోకి అడుగెట్టినట్లుగా తెలుస్తుంది. తాజాగా రకుల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఓ జట్టుకి కో-ఓనర్ గా మారింది. రకుల్ ప్రీత్ ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టుని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో రకుల్ జట్టు బరిలో నిలుస్తుంది. మరి ఈ విషయాన్నీ రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో ‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ఖరారు చేస్తూ  ట్వీట్ చేయడం జరిగింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.