(Local) Mon, 23 Sep, 2019

ప్రముఖ హీరోపై దాడి....?

August 14, 2019,   6:18 PM IST
Views: 104
Share on:
ప్రముఖ హీరోపై దాడి....?

సామాన్యంగా రోడ్డు మీద ఎవరినైనా అపి కొడుతుంటే చాల మంది చుస్తూ వాటిని వీడియో తీసి సోషల్ మాధ్యమాలలో పెడుతుంటారని సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ సంఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. అది కూడా ఓ హీరోకి.... కన్నడ హీరో కోమల్‌పై బెంగుళూరులో ఓ తాగుబోతు  కారులో వెళ్తున్న కోమల్‌ను ఆపి కిందకు దించి మరి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో హీరో ముక్కు, నోటికి తీవ్ర గాయాలు అయి రక్తం వచ్చింది. అయినా దుండగుడు ఆపకుండా అలానే దాడి చేశాడు. హీరో కోమల్ తన కూతురిని స్కూల్ నుంచి తీసుకురావడానికి కారులో బెంగుళూరులోని శ్రీరాంపుర రైల్వే సమీపం నుంచి వెళ్తున్నాడు.

ఇంతలో ఓ అగంతకుడు బైక్‌పై వేగంగా కోమల్ కారుని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని బైక్ కారుకు గీసుకుపోయింది. అయినా అతను అవేవీ పట్టించుకోలేదు. దీంతో కారులో ఉన్న హీరో కోమల్, బైకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన బైకర్ కోమల్ ముఖం, నోరు, ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో కోమల్ నోరు, ముక్కు వెంట తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, హీరో కోమల్ సోదరుడు ప్రముఖ హీరో బీజేపీ నాయకుడు జగ్గేష్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సోదరుడు కమల్‌పై దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. 

సంబంధిత వర్గం
ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య
ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య
నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేయబోతున్న.....స్టార ...
నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేయబోతున్న.....స్టార ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.