(Local) Mon, 30 Nov, 2020

దైవం మానవ రూపంలో బాలయ్య బాబు....నెటిజెన్లు

November 13, 2019,   4:02 PM IST
Share on:
దైవం మానవ రూపంలో బాలయ్య బాబు....నెటిజెన్లు

టాలీవుడ్ లో కొట్టిన, తిట్టినా అభిమానులకి ఆయన అంటే ఏ మాత్రం ఇష్టం తగ్గదు....ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో....నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ మరో మారు తన మంచి మనసు చాటుకున్నారు.. ఆయన అభిమానులు మా బాలయ్య ‘మేకప్ వేస్తే హీరో, తీస్తే మోర్ థెన్ ఏ హీరో’ అంటూ బాలయ్యను పొగుడుతున్నారు. ఇతర హీరోల అభిమానులు సైతం బాలయ్యను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం అనంతపురం సోమనాథ్ నగర్‌కు చెందిన పేద విద్యార్థిని స్వప్న బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోందని, చికిత్సకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని అభిమానుల ద్వారా తెలుసుకున్న బాలయ్య చలించిపోయారు. స్వప్నను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకు రావాలని అభిమానులకు పిలుపు నివ్వగా.. అనంతపురం నుండి కొందరు అభిమానులు దగ్గరుండి స్వప్నను, ఆమె కుటుంబ సభ్యులను  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

మంగళవారం బాలయ్య స్వయంగా ఆసుపత్రికి వెళ్లి స్వప్నను పలకరించి ధైర్యం చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు బాలయ్య వారితో గడిపారు. స్వప్నకు, ఆమె కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసానిచ్చారు. స్వప్న చికిత్సకు అవసరమైన ఖర్చును పూర్తిగా భరిస్తామని హామీ ఇచ్చారు.. తన కొత్త సినిమా ‘రూలర్’ కు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఫోన్‌లో స్వప్నకు చూపించారు బాలయ్య. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు ఇప్పటికే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారని, త్వరగా కోలుకుని ఉన్నత చదువులు చదవాలని ఆశాభావం వ్యక్తం చేశారు బాలయ్య.

పేదరికంతో జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన తనకు బాలకృష్ణ గారి చోరవతో జీవితంపై మళ్లీ ఆశలు చిగురించాయని, వైద్యులు, సిబ్బంది తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని స్వప్న సంతోషంగా చెప్పింది. బాలయ్య మంచిన మనసుకు స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో బాలయ్య, స్వప్నను పరామర్శిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘మనిషిగా పుట్టడం తేలికే కానీ మనిషిలా బ్రతకడం కష్టం.. ఇలాంటి ఎంతోమంది క్యాన్సర్ బాధిత చిన్నారులను బ్రతికిస్తున్న బాలయ్యా.. నువ్వు నేల మీద నడిచే దేవుడివయ్యా’ అంటూ అభిమానులు బాలయ్యను అభినందిస్తున్నారు..

సంబంధిత వర్గం
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...
చిన్నారి అభిమాని మరణం...ఎమోషనల్ లో బాలకృష్ణ
చిన్నారి అభిమాని మరణం...ఎమోషనల్ లో బాలకృష్ణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.