(Local) Mon, 18 Nov, 2019

ఆది, శ్రద్ధాల ‘జోడి’ ట్రైలర్ విడుదల.....

August 29, 2019,   4:31 PM IST
Share on:
ఆది, శ్రద్ధాల ‘జోడి’ ట్రైలర్ విడుదల.....

భావన క్రియేషన్స్‌ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్‌ సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్‌లు తెరకెక్కించిన చిత్రం “జోడి”. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో సాయి‌కు‌మార్‌ తన‌యుడు ఆది సాయి కుమార్ హీరోగా, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఈ జోడి చిత్రం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో ఆది, శ్రద్ధాల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. లవ్.. కామెడీ.. ఎమోషన్స్ సన్నివేశాలను ఈట్రైలర్ లో చూడవచ్చు. ఆది సాయికుమార్ తండ్రి పాత్రలో, బెట్టింగ్ పిచ్చోడిగా సీనియర్ నరేశ్ కనిపిస్తున్నారు. కాగా, శ్రద్ధా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడే అమ్మాయిగా కనిపిస్తోంది. హీరో.. హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ ట్రైలర్ లో ఉన్నాయి. గొల్లపూడి మారుతీరావు, సితార, వెన్నెల కిషోర్ వంటి నటీనటులు ఈ సిన్మాలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు ఆది. 

సంబంధిత వర్గం
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.