(Local) Fri, 17 Sep, 2021

స్టార్ డైరెక్టర్ పేరు మీద ఓ హోటల్.....

August 13, 2019,   11:01 AM IST
Share on:
స్టార్ డైరెక్టర్ పేరు మీద ఓ హోటల్.....

రాజకీయనాయకులతో మొదలుకొని సినీ సెలబ్రిటీస్ వరకు అభిమానులు ఉండటం చూస్తూనే ఉంటాం. కానీ ఆ అభిమానం ఎంత వరకు అనేది చెప్పడం కొంచం కష్టమే. ఇంతకీ ఈ అభిమానం టాపిక్ ఏంటి అనుకుంటున్నారా.... ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అంటే గుర్తు పట్టేవారు ఇప్పుడు మాత్రం వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పేరొందిన రాంగోపాల్ వర్మ అంటే తొందరగా గుర్తు పడతారు. అలాంటి వివాదాల వర్మ పేరు మీద ఒక హోటల్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూరలంక గ్రామంలో ఈ టిఫిన్ సెంటర్ ఉంది. వర్మ పేరును తన హోటల్ ప్రచారానికి వాడుకున్నాడా లేక అభిమానంతో పెట్టాడో తెలియదు కాని, ఏకంగా తన హోటల్‌కు రాంగోపాల్ వర్మ టిఫిన్స్ అని పేరుపెట్టుకున్నాడు ఆ హోటల్ యజమాని. వర్మ సినిమాలకు, వర్మకు తాను పెద్ద ఫ్యాన్ అని, అందుకే వర్మ పేరుతో హోటల్ పెట్టుకున్నానని అంటున్నారు. అంతేకాక హోటల్ లో ఎక్కడ చుసిన వర్మ పోస్టర్ లతో నిండిపోయి ఉంటుంది. హోటల్ యజమాని వర్మ పేరు పెట్టడం మూలంగా ప్రచారం బాగా జరిగి వ్యాపారం బానే సాగుతుందని అంటున్నాడు. అయితే ఇక్కడ టిఫిన్స్ కూడా రుచికరంగా ఉండటంతో ఆ నోటా.. ఈ నోటా తెలిసి మంచి గిరాకీగా సాగుతుది ఈ రాంగోపాల్ వర్మ హోటల్. 

సంబంధిత వర్గం
బ్రూస్‌లీ జయంతి సందర్భంగా `ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న ...
బ్రూస్‌లీ జయంతి సందర్భంగా `ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న ...
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ విడుదల....వర్మ
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ విడుదల....వర్మ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.