(Local) Mon, 18 Nov, 2019

486 రూబిక్ క్యూబ్స్‌తో ఆ హీరో ముఖచిత్రం....డైహార్డ్ ఫ్యాన్'

August 26, 2019,   4:48 PM IST
Share on:
486 రూబిక్ క్యూబ్స్‌తో ఆ హీరో ముఖచిత్రం....డైహార్డ ...

బాహుబలి తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఎంత పెరిగిందో చెప్పనక్కర్లేదు. బాహుబలి వచ్చి రెండేళ్ల తర్వాత మళ్ళీ ప్రభాస్ సాహో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్, టీజర్, సాంగ్స్ యూట్యూబ్ లో హల చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాహో టీజర్ లో ప్రభాస్ శ్రద్ధ తో ఓ యాక్షన్  సీన్ లో అస్సలు ఎవరు వీళ్ళు అని అడిగితే ఫాన్స్....'డైహార్డ్ ఫ్యాన్స్' అని ప్రభాస్ చెప్పిన డైలాగ్  బాగా ఫేమస్ అయింది. అయితే ఆ డైలాగ్ ఫేమౌస్ అవ్వడమే కాదు అది నిజం చేస్తూ ఓ డై‌హార్డ్ ఫ్యాన్ ఏకంగా ప్రభాస్ కోసం ఓ అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేశాడు. ఒరిస్సాకు చెందిన సదరు అభిమాని 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంటల పాటు శ్రమించి ప్రభాస్ ముఖచిత్రాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ అభిమాని ఆర్ట్‌కు ప్రశంసలు కురిపించారు. మరోవైపు ‘సాహో’ అడ్వాన్స్ బుకింగ్‌లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ చిత్రం విడుదల తర్వాత మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి. 
 

సంబంధిత వర్గం
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.