(Local) Sat, 24 Jul, 2021

రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కైవసం చేసుకోబోతున్న....మహానటి

August 09, 2019,   5:06 PM IST
Share on:
రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కైవసం చేసుకోబోతున్న. ...

భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా భారత జాతీయ చలనచిత్ర అవార్డులు అందజేయబడతాయి సంగతి తెలిసిందే.  అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది 66​వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. కాగా దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 66​వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో  తెలుగు సినిమాలు మెరిశాయి. అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా​కు జాతీయ పురస్కారం లభించడం విశేషం. ఈ సినిమాలో సావిత్రి పాత్రని పోషించిన కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. సాం​కేతిక విభాగాల్లో ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్‌ ఎంపికైంది. పద్మావత్‌ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు.

66వ జాతీయ పురస్కారాల విజేతల వివరాలు.. 

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా (అంధాధున్‌)
ఉత్తమ నటి: కీర్త సురేశ్‌ (మహానటి)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య దర్‌(ఉడి)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహానటి
ఉత్తమ యాక్షన్ సినిమా‌: కేజీఎఫ్‌
బెస్ట్‌ మేకప్‌, విజువల్‌, స్పెషల్‌ ఎఫెక్ట్‌: అ!
ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: చి.ల.సౌ
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌: ఉత్తరాఖండ్‌
ఉత్తమ తమిళ చిత్రం: బారమ్‌

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.