(Local) Fri, 17 Sep, 2021

నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 28, 2019,   1:26 PM IST
Share on:
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : దీర్ఘ కాలిక రుణ బాధలు చికాకు పరుస్తాయి.దూర ప్రయాణాలు.సన్నిహితులతో వివాదాలు.ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.ఎంత కష్టించినా ఫలితం దక్కని స్థితి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత ఊరట కలుగుతుంది.వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి.ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి.రాజకీయ, కళారంగాల వారికి చిక్కులు.ఐటీ నిపుణులు శ్రమపడే సమయం.విద్యార్థులకు అంచనాలు కొన్ని తప్పుతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం : పనులలో జాప్యం.ప్రయాణాలు చివరిలో రద్దు.బంధువర్గంతో విరోధాలు.శ్రమ పెరుగుతుంది.మిత్రులు శత్రువులుగా మారే అవకాశం.రాబడి నిరుత్సాహపరుస్తుంది.కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు మానసిక అశాంతి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు....నలుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

మిథునం : పనుల్లో అనుకూలత.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.ఆలోచనలు అమలు చేస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.సన్నిహితులు అన్నింటా సహకరిస్తారు.కాంట్రాక్టర్లు, రియల్టర్లు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు.ఉద్యోగాల్లో ప్రమోషన్లు.వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఐటీ నిపుణులు కార్యసాధనలో విజయం పొందుతారు.విద్యార్థులకు ఊరట కలిగించే సమయం.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు సామాన్యమే.అదృష్ట రంగులు....గోధుమ, కాఫీ.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం : ఇంటాబయటా ఉత్సాహం గడుపుతారు.సేవా కార్యక్రమాల పై ఆసక్తి.కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలోఉంటాయి.రియల్‌ఎస్టేలల్‌ వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు.ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు.రాజకీయ, కళారంగాల వారికి అరుదైన పురస్కారాలు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు.విద్యార్థులు శ్రమానంతరం ఫలితం దక్కించుకుంటారు.మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు.... తెలుపు, గోధుమ.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం : ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.అనుకోని సంఘటనలు.వివాదాలకు దూరంగా ఉండండి.ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాలి.ఆరోగ్య పరంగా చికాకులు. ఔషధసేవనం.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు స్థానమార్పులు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.విద్యార్థులకు ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి.మహిళలకు మానసిక ఆందోళన కొంత తొలగుతుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కన్య : బంధువులతో తగాదాలు.ప్రయాణాల్లోనూ, పనులలోనూ ఆటంకాలు.శారీరక  రుగ్మతలు.వ్యవహారాల్లో అంచనాలు తప్పే సూచనలు.రియల్‌ ఎస్టేట్‌ల వారు కొంత ఆచితూచి వ్యవహరించాలి.వ్యాపార  లావాదేవీలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు..దూరపు బంధువులను కలుసుకుంటారు.రాజకీయ, పారిశ్రామిక, కళారంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది.ఐటీ నిపుణులకు అవకాశాలు కొన్ని దక్కుతాయి.విద్యార్థులు శ్రమపడినా ఫలితం దక్కించుకుంటారు.మహిళలకు కొంత ధనలాభం.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల : పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేస్తారు.ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.అందరిలోనూ గుర్తింపు పొందుతారు.ఆలయాలు సందర్శిస్తారు.కొత్త వ్యక్తుల పరిచయం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని చిక్కులు.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.పారిశ్రామిక, కళారంగాల వారికి పురస్కారాలు.ఐటీ నిపుణులకు గందరగోళం.విద్యార్థులకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది.మహిళలకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు.... నీలం, పసుపు.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.ముఖ్య కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.ముఖ్య నిర్ణయాలలో తొందరవద్దు.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువులతో విభేదాలు.ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఖరారు.ఐటీ నిపుణులకు వివాదాలు కొంత పరిష్కారం.విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలలో కొద్దిపాటి లాభాలు.అదృష్ట రంగులు....ఎరుపు, గులాబీ.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు : బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.రహస్య విషయాలు తెలుసుకుంటారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త అవకాశాలు.వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.రాజకీయ, కళారంగాల వారికి సన్మాన , సత్కారాలు.ఐటీ నిపుణులకు వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.విద్యార్థులకు అంచనాలు కొన్ని నిజమవుతాయి.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకరం : వ్యవహారాలు మందగిస్తాయి.అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.శ్రమ తప్ప ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు.ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి.కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు.కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు.కొత్త వ్యాపారాల ఆలోచనలు కలిసిరావు.ఉద్యోగులకు ఊహించని మార్పులు.రాజకీయ, కళారంగాల వారికి కొంతలో కొంత నయంగా కనిపిస్తుంది.ఐటీ నిపుణులకు కొద్దిపాటి చికాకులు.విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు....నీలం, నలుపు.

పరిహారాలు :  శివాష్టకం పఠించండి.

కుంభం : దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు.పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.విలువైన వస్తువులు సేకరిస్తారు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు.వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి ప్రశంసలు.రాజకీయ, కళారంగాల వారికి శుభదాయకమైన కాలం.ఐటీ నిపుణులకు ఒత్తిడులు.విద్యార్థులకు కొంత నిరాశ.మహిళలకు ఆస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం : ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు.వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు.శుభకార్యాలకు హాజరవుతారు.రాబడి కొంత పెరిగే సూచనలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూలం.వ్యాపారాలలో నూతనోత్సాహం.ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు కొద్దిపాటి చికాకులు.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, ఎరుపు.

పరిహారాలు :  గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.