(Local) Wed, 20 Oct, 2021

నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 25, 2019,   11:25 AM IST
Share on:
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : నూతన ఉద్యోగాలు లభిస్తాయి.సోదరులతో వివాదాల పరిష్కారం.శుభకార్యాలలో పాల్గొంటారు.పాత బాకీలు వసూలవుతాయి.కాంట్రాక్టులు పొందుతారు.రాబడి సంతృప్తినిస్తుంది.వ్యాపారాలలో పురోగతి.ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీయానం.ఐటీ నిపుణులు కాస్త నిరాశ చెందుతారు.విద్యార్థులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు.... తెలుపు, గులాబీ.

పరిహారాలు : గణపతి పూజలు చేయండి.

వృషభం : రాబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.నూతన వస్తు, వస్త్ర లాభాలు.వ్యాపారాలలో ఉన్నతి.ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అరుదైన పురస్కారాలు.ఐటీ నిపుణులకు మార్పులు తథ్యం.విద్యార్థులకు ఊహించని అవకాశాలు.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....గులాబీ, కాఫీ.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.

మిథునం : కొత్త రుణ యత్నాలు.మిత్రులే శత్రువులుగా మారతారు.ఆకస్మిక ప్రయాణాలు.కొన్ని కీలక ఒప్పందాలు వాయిదా.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి శ్రమాధిక్యమైనా ఫలితం కనిపిస్తుంది.వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలలో మార్పులు.కళాకారులు,పారిశ్రామికవర్గాలకు మానసిక అశాంతి.ఐటీ నిపుణులకు పనిఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థులు మరింత శ్రమపడాలి.మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....లేత పసుపు, కాఫీ.

పరిహారాలు : లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.వివాదాలకు కొంత దూరంగా ఉండండి.సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.మిత్రులతో అకారణ విరోధాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్యం.వ్యాపారాలలో స్వల్ప లాభాలు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది.విద్యార్థుల అంచనాలు కొన్ని నిజం కాగలవు.మహిళలలో ఆస్తిలాభ సూచనలు.షేర్ల విక్రయాలు కొద్దిపాటి లాభాలు.అదృష్ట రంగులు....నీలం, తెలుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

సింహం : మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి..ప్రయాణాలు అనుకూలిస్తాయి.సంఘంలో ఆదరణ చూరగొంటారు.ప్రతిభకు గుర్తింపు పొందుతారు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పవు.కొత్త వ్యాపారాలు ప్రారంబిస్తారు.ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు.విద్యార్థులకు ఒత్తిడులు ఎదురవుతాయి.మహిళలకు శుభ వర్తమానాలు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు.... లేత పచ్చ, కాఫీ.

పరిహారాలు :  శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

కన్య : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు.వ్యయప్రయాసలకోర్చి పనులు పూర్తి చేస్తారు.ఆలోచనలు నిలకడగా ఉండవు.వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.మిత్రులతో విరోధాలు.ఇంటాబయటా చికాకులు..రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత అనుకూల స్థితి.వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు.ఉద్యోగులకు స్థానచలన సూచనలు..పారిశ్రామిక, కళారంగాల వారికి ఒడిదుడుకులు.ఐటీ నిపుణులకు విదేశీ యానం వాయిదా.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలు సామాన్యంగా సాగుతాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  అన్నపూర్ణాష్టకం పఠించండి.

తుల : ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.ఇంటాబయటా అనుకూల వాతావరణం.సన్నిహితులతో వివాదాలు తీరతాయి.పురస్కారాలు పొందుతారు.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.ఆదాయం పెరుగుతుంది.కాంట్రాక్టర్లకు కోర్టు కేసులు.వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.విద్యార్థుల యత్నాలు సఫలం.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం : రాబడి అంతగా ఉండదు.రుణాలు చేయాల్సిన పరిస్థితి.బంధువులతో మాటపట్టింపులు, వివాదాలు.శారీరక∙రుగ్మతలు.ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు మందగిస్తాయి.వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.ఉద్యోగాల్లో  పనిభారం పెరుగుతుంది.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.విద్యార్థులకు మరింత ఉత్సాహం.మహిళలకు స్వల్ప ధనలబ్ధి.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : నూతన విషయాలు తెలుసుకుంటారు.పరిస్థితులు అనుకూలిస్తాయి.ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.వస్తు, వస్త్ర లాభాలు.కీలక నిర్ణయాలు తీసుకొంటారు.వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్య స్థితి.భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు.విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి.మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...తెలుపు, కాఫీ.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

మకరం :అందరిలోనూ గుర్తింపు పొందుతారుసంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది..విలువైన వస్తువులు సేకరిస్తారు.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.కొన్ని సమస్యలు మాత్రం చికాకు పరుస్తాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త కాంట్రాక్టులు పొందుతారు.వ్యాపారులకు లాభాలు అందుతాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి.పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.విద్యార్థులకు అవకాశాలు ఎట్టకేలకు దక్కుతాయి.మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది.షేర్ల విక్రయాలలో తొందరపాటు వద్దు.అదృష్ట రంగులు...గులాబీ, ఎరుపు.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కుంభం : కుటుంబంలో చికాకులు.భూములు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా.పనులలో కొంత పురోగతి కనిపిస్తుంది.ఆరోగ్య భంగం, ఔషధ సేవనం.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.ప్రత్యర్థులు సమస్యలు సృష్టిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత అనుకూలం.వ్యాపారులకు లాభాలుఅంతగా ఉండవు.ఉద్యోగులకు స్థాన చలనం.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థులకు కృషి కొంతమేర ఫలిస్తుంది.మహిళలకు భూలాభాలు.అదృష్ట రంగులు...పసుపు, లేత ఎరుపు.

పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం : ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేయాల్సివస్తుంది.దూర ప్రయాణాలు ఉంటాయి.ఇంటాబయటా బాధ్యతలు అధికమవుతాయి.స్వల్ప శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు .రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు.ఐటీ నిపుణులకు శుభవార్తలు.విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.