(Local) Wed, 20 Oct, 2021

నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 22, 2019,   1:39 PM IST
Share on:
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : సంఘంలో గౌరవం పొందుతారు.సన్నిహితుల నుంచి ధనలబ్ధి.చేపట్టిన కార్యక్రమాలలో విజయం..అదనపు ఆదాయం  లభిస్తుంది.రియల్‌ఎస్టేట్‌ల వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.వ్యాపారులకు ఉత్సాహంగా ఉంటుంది.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.ఐటీ నిపుణులకు సామాన్యమే.రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

వృషభం : ఆర్థిక పరిస్థితి  నిరాశ కలిగిస్తుంది.కొత్త రుణాలు చేస్తారు.ఆలోచనలు నిలకడగా ఉండవు.శారీరక రుగ్మతలు వేధిస్తాయి.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.తీర్థ యాత్రలు చేస్తారు.ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత అనుకూల పరిస్థితి.వ్యాపారులకు పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు.ఉద్యోగాలలో ప్రమోషన్లలో ఆటంకాలు.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, పసుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం : కార్యక్రమాలు మధ్యలోనే రద్దుచేసుకుంటారు.బంధువులతో విరోధాలు.ఆరోగ్య భంగం. ఆస్పత్రులను సందర్శిస్తారు.ఆర్థిక ఇబ్బందులు తప్పవు.ఆలయాలు సందర్శిస్తారు.ఒక సమాచారం కాస్త ఊరటనిస్తుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారు వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు.వ్యాపారాలలో లాభాలు అంతగా దక్కవు.ఉద్యోగాల్లో చిక్కులు, అదనపు బాధ్యతలు.విద్యార్థులు మరింత కష్టపడితే ఫలితం కనిపిస్తుంది.మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు :  శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.పరిచయాలు పెరుగుతాయి.అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.విద్యార్థులు ఒత్తిడుల నుంచి బయటపడతారు.మహిళలకు మరింత ఉత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...గులాబీ, లేత పసుపు.

పరిహారాలు : వినాయక స్తోత్రాలు పఠించండి.

సింహం : దూర ప్రయాణాలు.బంధు మిత్రులతో కలహాలు .ఇంటబయటా ఒత్తిడులు పెరుగుతాయి.శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.పనుల్లో ప్రతిబంధకాలు.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత అనుకూలం.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆశించిన లాభాలు కష్టమే.ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో పొరపాట్లు దొర్లుతాయి.పారిశ్రామిక, కళారంగాల వారు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా మెలగాలి.ఐటీ నిపుణులకు సమస్యలు కొంతమేర తీరతాయి.విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు.మహిళలకు నిరుత్సాహం.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు, పసుపు

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

కన్య : ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు.బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆస్తి వివాదాల పరిష్కారం.గృహ, వాహన యోగాలు.ఆదాయం పెరుగుతుంది.ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకం.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.విద్యార్థులకు కొంత ఊరట.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.అదృష్ట రంగులు...గులాబీ, ఆకుపచ్చ .

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల : చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు.ఇంటాబయటా లేనిపోని ఒత్తిడులు.ఆకస్మిక ప్రయాణాలు.ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు.బంధువులు మీ పై ఒత్తిడులు పెంచుతారు.ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటారు.సన్నిహితులతో మాటపట్టింపులు.కాంట్రాక్టర్ల యత్నాలు ఫలిస్తాయి.వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగస్తులు కొంత అప్రమత్తతో విధులు నిర్వహించాలి.విద్యార్థులకు ఫలితాలపై నిరుత్సాహం.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : నేర్పుగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు.ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయం.సంస్థలు, క్లబ్‌లలో సభ్యత్వాలు స్వీకరిస్తారు.కాంట్రాక్టులు అవలీలగా దక్కించుకుంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఉద్యోగులు ఉత్సాహంగా విధి నిర్వహణలో పాల్గొంటారు.రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. విదేశీ యానం.ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు వద్దు.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు కొంత ఊరట లభిస్తుంది.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు, తెలుపు.

పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు : ఆర్థిక విషయాలు ఆశించిన రీతిలోనే ఉంటాయి.సన్నిహితులు మరింత దగ్గరవుతారు.కొన్ని  వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.విహార యాత్రలు చేస్తారు.ప్రయాణాల్లో ఆటంకాలు తొలగుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది.వ్యాపారాల విస్తరణకు మార్గం ఏర్పడుతుంది. పెట్టుబడులు అందుతాయి.విద్యార్థుల యత్నాలు కొంత మేర ఫలిస్తాయి.మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.షేర్ల విక్రయాలలో లాభాలు ఆర్జిస్తారు.అదృష్ట రంగులు...గులాబీ, ఎరుపు.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకరం : కొత్త రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు.ఆలోచనలు నిలకడ ఉండవు.ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెంటనే మార్పు చేస్తారు.తీర్థ యాత్రల పై ఆసక్తి చూపుతారు.వివాదాల నుంచి బయటపడేందుకు మరింత శ్రమపడాలి.కొన్ని ముఖ్య కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.శారీరక రుగ్మతలు.ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.ఐటీ నిపుణులకు వివాదాలు.విద్యార్థులకు నిరాశ.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.అదృష్ట రంగులు...నీలం, నలుపు .

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం : కుటుంబ సభ్యులతో విభేదాలు.ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.లేని పోని ఖర్చులుమీద పడతాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఇంటర్వ్యూలలో నిరాశ.బంధువుల నుంచి ఒత్తిడులు.అనారోగ్య సూచనలు.ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపార వర్గాలకు పెట్టుబడులు సకాలంలో అందవు. లాభాలు కష్టమే.ఉద్యోగస్తులు విధి నిర్వహణలో అప్రమత్తతో మెలగాలి.రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి.ఐటీ నిపుణులకు కాస్త ఊరట లభిస్తుంది.విద్యార్థులు ఫలితాలలో గందరగోళం.మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...నేరేడు, ఆకుపచ్చ.

పరిహారాలు :  కనకథారా స్తోత్రాలు పఠించండి.

మీనం : పనులలో విజయం.ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.ఆలయాలు సందర్శిస్తారు.ఆలోచనలు అమలు చేస్తారు.చర స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అనుకూల పరిస్థితి.ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశాల నుంచి పిలుపు రావచ్చు.ఐటీ నిపుణులు కొంత గందరగోళంలో గడుపుతారు.విద్యార్థులు ఆచితూచి ముందుకు సాగాలి.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలలో కొద్దిపాటిలాభాలు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, ఎరుపు.

పరిహారాలు :  లక్ష్మీ స్తుతి మంచిది.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.