(Local) Wed, 20 Oct, 2021

నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 20, 2019,   12:09 PM IST
Share on:
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి.ఆస్తి వివాదాలు నెలకొంటాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాల నుంచి కాస్త ఊరట.వ్యాపారాలు మందగిస్తాయి. అనుకున్న లాభాలు కష్టమే.ఉద్యోగాలలో ఒడిదుడుకులు.పారిశ్రామికవర్గాలకు నిరాశ తప్పదు.ఐటీ రంగం వారికి పనిభారం కొంత తగ్గవచ్చు.విద్యార్థులకు పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు.మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయ నిరాకరణ.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు..

పరిహారాలు : గణపతిని పూజించండి.

వృషభం : వ్యవహారాలు కాస్త మందకొడిగా సాగుతాయి.ప్రయాణాలలో ఆటంకాలు.కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ఆదాయం అంతగా ఉండదు.కాంట్రాక్టర్లకు నిరుత్సాహం.వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో అదనపు విధులు.రాజకీయవర్గాలకు పదవులు చేజారతాయి.ఐటీ నిపుణులకు శ్రమ పెరుగుతుంది.విద్యార్థులకు పరిశోధనలు ముందుకు సాగవు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు...గులాబీ, లేత పసుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం : కొన్ని చర్చలు ఫలిస్తాయి.సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.కుటుంబ సభ్యులతో తగాదాలు తీరతాయి.గృహం, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆదాయం తగ్గినా అవసరాలకు ఇబ్బంది ఉండదు.కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు పొందుతారు.వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు.ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి.పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.ఐటీ నిపుణులకు ఊహించని అవకాశాలు.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...లేత గులాబీ. నలుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం : ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.శ్రమ తప్ప ఫలితం కనిపించదు.వివాదాలకు దూరంగా ఉండంÆడి.అనారోగ్యం, ఔషధ సేవనం.ఆలోచనలు కొంత కలసి వస్తాయి.సోదరులు, మిత్రులతో విభేదాలు.ఆకస్మిక ప్రయాణాలు.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.ఐటీ రంగం వారికి స్వల్ప మార్పులు.విద్యార్థులకు అవకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం : నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు.ధార్మిక కార్యక్రమాల పై ఆసక్తి.ఇంటిలో విందువినోదాలు.అదనపు ఆదాయం చేకూరుతుంది.సన్నిహితులు చేయూతనందిస్తారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.వ్యాపారులకు లాభాలు దక్కుతాయి.ఉద్యోగులు సంతోషంగా గడుపుతారు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు..మహిళలకు ముఖ్యసమాచారం..షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...గోధుమ, బంగారు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

కన్య : ఆర్థిక విషయాలు కొంతలో కొంత అనుకూలిస్తాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం.శ్రమ పెరుగుతుంది.అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.శారీరక రుగ్మతలు బాధిస్తాయి.ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు అవకాశాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి.మహిళలకు కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...కాఫీ, ఎరుపు.

పరిహారాలు : శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

తుల : కొత్త మిత్రుల పరిచయం.శుభవార్తా శ్రవణం.ఆప్తుల నుంచి సలహాలు అందుకుంటారు.నూతన వస్తు, వస్త్రలాభాలు.నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.ప్రత్యర్థుల పై పట్టు సాధిస్తారు.రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.పారిశ్రామికవర్గాలకు  సన్మానాలు.ఐటీ రంగం వారికి తగిన గుర్తింపు లభిస్తుంది..విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : గణపతిని పూజించండి.

వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు.సన్నిహితుల నుంచి కీలక సమాచారం.పనులు నెమ్మదిగా సాగుతాయి.ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలలో కొద్దిపాటి అవాంతరాలు.ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి సహాయం.వ్యాపారులకు స్వల్ప లాభాలు..రాజకీయవర్గాలకు నూతనోత్సాహం,పదవీయోగంఐటీ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.విద్యార్థులకు లక్ష్యాలు సాధ్యమే.మహిళలకు భూ, గృహయోగాలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు,తెలుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

ధనుస్సు : కుటుంబ సభ్యులతో కొంత ఉత్సాహంగా గడుపుతారు.శ్రమాధిక్యమైనా ఫలితం కనిపిస్తుంది.పనుల్లో కొన్ని  అవాంతరాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.పారిశ్రామికవర్గాలకు చికాకులు తప్పవు.విద్యార్థులకు అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు.మహిళలకు ఆరోగ్య సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...గులాబీ,లేత పసుపు.

పరిహారాలు :  నరసింహ స్తోత్రాలు పఠించాలి.

మకరం : వ్యవహారాలలో కొంత పురోగతి ఉంటుంది.ఆలోచనలు నిలకడగా ఉండవు.కష్టపడ్డా ఫలితం అంతగా ఉండదు.ఆరోగ్య, కుటుంబసమస్యలు.దూరప్రయాణాలు ఉంటాయి.సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు బదిలీలు, లేదా పనిభారాలు.విద్యార్థులకు కొంత అసంతృప్తితప్పదు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, నీలం.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

కుంభం : కొత్త కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.చిరకాల మిత్రులను కలుసుకుంంటారు.పలుకుబడి పెరుగుతుంది.ఆశ్చర్యకరమైన సంఘటనలు.వాహనాలు,స్థలాలు కొంటారు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు కేసులు తీరతాయి.వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో ఒత్తిడులు అ«ధిగమిస్తారు.విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.మహిళలకు సంతోషకరమైన వార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, పసుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

మీనం : పరిచయాలు పెరుగుతాయి.వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు.వాహనాలు,స్థలాలు కొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారి ప్రయత్నాలు సఫలం.వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.ఉద్యోగాలలో ప్రమోషన్లు.రాజకీయవర్గాలకు సన్మానాలు.విద్యార్థులకు అరుదైన అవకాశాలు.మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.