(Local) Wed, 20 Oct, 2021

నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 16, 2019,   1:02 PM IST
Share on:
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.మీ ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు.ఆలయాలు సందర్శిస్తారు.భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి.ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు సన్మానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం : బంధుమిత్రుల నుంచి విమర్శలు.అనుకోని ప్రయాణాలు.ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.సన్నిహితులను కలుసుకుని సహాయం కోరతారు.ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు.సేవాకార్యక్రమాల పై ఆసక్తి.శారీరక  రుగ్మతలు.కాంట్రాక్టులు చేజారవచ్చు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు కుటుంబంలో సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... గులాబీ, కాఫీ.

పరిహారాలు :  గణేశ్‌కు అభిషేకం చేయండి.

మిథునం : ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.ఆత్మీయులు, బంధువులతో తగాదాలు తీరతాయి. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి.స్థిరాస్తి వివాదాల పరిష్కారం.విద్యార్థులకు నూతన అవకాశాలు.వ్యాపారాలలో ముందుకు సాగుతారు.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.ఐటీ నిపుణులకు అరుదైన అవకాశాలు.విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.మహిళలకు విశేష గౌరవం.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు.... పసుపు,కాఫీ.

పరిహారాలు :  శివాష్టకం పఠించండి.

కర్కాటకం : ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు.ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు.బంధుగణం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు ఉండవచ్చు.తొందరపాటు నిర్ణయాలు వద్దు.ఆదాయం అంతగా ఉండదు.ఉద్యోగాల్లో శ్రమ తప్పదు.వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.పారిశ్రామిక, వైద్య రంగాల వారికి  సమస్యలు వేధిస్తాయి.ఐటీ నిపుణులు నిర్ణయాలలో వెనకడుగు వేస్తారు.విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది.మహిళలకు నిరుత్సాహమే.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.... గులాబీ, ఆకుపచ్చ.

పరిహారాలు :  కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం : దూరపు బంధువుల కలయిక.విందువినోదాల్లో పాల్గొంటారు.శుభకార్యాల రీత్యా ఖర్చులు.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.ఆశ్చర్యకరమైన సంఘటనలు.అందరితోనూ విలాసవంతంగా గడుపుతారు.రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.వ్యాపారాలలో పురోగతి.ఉద్యోగులకు ప్రమోషన్లు.రాజకీయవర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది.విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి.

కన్య : పనుల్లో విజయం సాధిస్తారు.నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు.మిత్రుల నుంచి ధనలాభం.ప్రయత్న కార్యసిద్ధి.వాహన యోగం.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు ఉన్నత స్థితి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు.విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.మహిళలకు ఆస్తి లాభం. షేర్ల విక్రయాలలో అధికలాభాలు.అదృష్ట రంగులు.... లేతనీలం, పసుపు.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

తుల : ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో చికాకులు.బంధువులతో విభేదాలు.అంచనాలు తారుమారు.పుణ్య క్షేత్రాల సందర్శనం.పనుల్లో ప్రతిబంధకాలు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో చిక్కులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.విద్యార్థులకు ఆటుపోట్లు.మహిళలకు ఒడిదుడుకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... ఎరుపు, గులాబీ.

పరిహారాలు :  గణపతిని ఆరాధించండి.

వృశ్చికం : కుటుంబ సమస్యలు వేధిస్తాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.పనుల్లో ఆటంకాలు.భూ వివాదాలు చికాకు పరుస్తాయి.శ్రమాధిక్యమే.శారీరక  రుగ్మతలు.ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు.వ్యాపారులకు అంతగా లాభాలు అందవు.ఉద్యోగాలలో నిదానంగా వ్యవహరించడం మంచిది.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మానసిక ఒత్తిడులు.ఐటీ నిపుణులకు శ్రమ తప్పదు.విద్యార్థులకు కొంత అసంతృప్తి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు.... కాఫీ, గోధుమ.

పరిహారాలు :  దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

ధనుస్సు : నూతన కార్యక్రమాలు చేపడతారు.బంధువుల నుంచి శుభవార్తలు.ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు.చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.పారిశ్రామిక వర్గాలకు పలుకుబడి పెరుగుతుంది.ఐటీ నిపుణులకు ఊహించని అవకాశాలు.విద్యార్థుల కృషి ఫలిస్తుంది.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు.... నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు :  హనుమాన్‌ఛాలీసా పఠించండి.

మకరం : దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.చిరకాల కోరిక నెరవేరే సమయం.శత్రువులు మిత్రులుగా మారతారు.ప్రముఖులతో పరిచయాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహం.వ్యాపారులు లాభాలు అందుతాయి.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అరుదైన పురస్కారాలు.ఐటీ నిపుణులకు వివాదాలు తీరతాయి.విద్యార్థులకు ఊహించని అవార్డులు.మహిళలకు సోదరులతో సఖ్యత.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు :  రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

కుంభం :  ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు.కుటుంబంలో చికాకులు తప్పవు.ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం వద్దు.తీర్థ యాత్రలు చేస్తారు.కాంట్రాక్టులు అనుకూలించవు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థుల యత్నాలు ముందుకుసాగవు.మహిళలకు కుటుంబ సమస్యలు.షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

పరిహారాలు :  విష్ణు ధ్యానం మంచిది.

మీనం : అనుకోని ప్రయాణాలు.ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు.కుటుంబ సభ్యులతో విభేదాలు.ఆరోగ్య భంగం, ఔషధ సేవనం.సన్నిహితులతో మాటపట్టింపులు.వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు.ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.ఐటీ నిపుణులకు కొన్ని  అవకాశాలు చేజారవచ్చు.విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది.మహిళలకు సోదరులతో కలహాలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... పసుపు, కాఫీ.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.