(Local) Wed, 20 Oct, 2021

నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 15, 2019,   11:56 AM IST
Share on:
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేస్తారు. .మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు.ఇంటాబయటా కొన్ని సమస్యలు.ముఖ్య కార్యక్రమాలు నెమ్మదిగానే సాగుతాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారి ఆచితూచి అడుగేయాలి.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.రాజకీయవర్గాల వారు నిర్ణయాలలో తొందరపడరాదు.ఐటీ నిపుణులకు చిక్కులు.విద్యార్థులు  ఫలితాలు అంతగా సంతప్తి కలిగించవు.మహిళలకు కుటుంబపరంగా చికాకులు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

పరిహారాలు :  రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

వృషభం : ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.రాబడి మరింత ఆశాజనకంగా ఉంటుంది.సన్నిహితులతో ముఖ్య విషయాల పై చర్చలు జరుపుతారు.సమాజంలో గౌరవం పొందుతారు.ఆలయాలు సందర్శిస్తారు.కాంట్రాక్టులు దక్కుతాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం రాగలదు.విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... గులాబీ, కాఫీ.

పరిహారాలు :  శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

మిథునం : దూర ప్రయాణాలు ఉండవచ్చు.పడ్డ శ్రమకు ఫలితం కనిపించదు.వివాదాలకు దూరంగా ఉండండి.సన్నిహితులతో మాటపడాల్సివస్తుంది.సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు.వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు స్థాన మార్పులు.పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థులలో ఉత్సాహం తగ్గుతుంది.మహిళలకు ఆరోగ్య సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  శివాష్టకం పఠించండి.

కర్కాటకం : ఉద్యోగ యత్నాలు సానుకూలం.అందరిలోనూ గుర్తింపు పొందుతారు.వ్యవహారాలలో విజయం సాధిస్తారు.శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు..పారిశ్రామిక,రాజకీయవేత్తలకు శుభవర్తమానాలు.ఐటీ నిపుణులకు ఒత్తిడుల నుంచి విముక్తి.విద్యార్థులు పడ్డ శ్రమకు ఫలితం దక్కుతుంది.మహిళలకు ఆస్తిలాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....నీలం, పసుపు.

పరిహారాలు : శివ పంచాక్షరి పఠించండి.

సింహం : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.ఆశ్చర్యకరమైన సంఘటనలు.వాహనాలు కొంటారు.బంధువులతో వివాదాలు పరిష్కారం.అదనపు ఆదాయం లభిస్తుంది.కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.విద్యార్థుల పరిశోధనలకు గుర్తింపు లభిస్తుంది.మహిళలకు అంచనాలు నిజమవుతాయి.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు....గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : గణపతికి అభిషేకం చేయండి.

కన్య : వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు.ఆదాయం నిరాశ కలిగిస్తుంది.బంధువులతో విరోధాలు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి.ఇంటాబయటా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు బదిలీలు.విద్యార్థులకు గందరగోళం.మహిళలు కొంత నిరాశ చెందుతారు.షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : కనకధారా స్తోత్రాలు పఠించండి.

తుల : ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.సన్నిహితులతో విరోధాలు ఉంటాయి.అనారోగ్యం.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.రాజకీయవర్గాల కృషి ఫలించదు.విద్యార్థులకు నిరాశే మిగులుతుంది.మహిళలు కుటుంబంలో చికాకులు.షేర్లవిక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.రాబడి పెరుగుతుంది.మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఆథ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.బంధువుల నుంచి సహాయం అందుతుంది.ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి.పారిశ్రామిక,వైద్య రంగాల వారికి సత్కారాలు.ఐటీ నిపుణులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.విద్యార్థులకు ఊహించని అవకాశాలు.మహిళలకు ఆరోగ్యం కుదుటపడుతుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....బంగారు, కాఫీ.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : ఇంటాబయటా పరపతి పెరుగుతుంది.బంధువులు, మిత్రులతో సయోధ్య ఏర్పడుతుంది.భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి.చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి.కాంట్రాక్టు పనులు చేపడతారు.వాహనాల కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి.కాంట్రాక్టులు దక్కుతాయి.వ్యాపారాలలో అడుగు ముందుకువేస్తారు.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు.మహిళలకు సంతోషకరమైన కాలం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, పసుపు.

పరిహారాలు : కనకదుర్గాదేవిని పూజించండి.

మకరం : ఆకస్మిక ప్రయాణాలుసన్నిహితులు కూడా శత్రువులుగా మారతారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ప్రయాణాలు తుదిక్షణంలో వాయిదా వేస్తారు.శారీరక రుగ్మతలు.బంధువులతో మాటపట్టింపులు.వ్యయప్రయాసలు తప్పవు.రాబడి నిరుత్సాహపరుస్తుంది.వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు.ఉద్యోగులకు మార్పులు చోటుచేసుకోవచ్చు.రాజకీయ,పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు.విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది.మహిళలకు ఆరోగ్య భంగం.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టసాధ్యమే.అదృష్ట రంగులు....తెలుపు, గోధుమ.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కుంభం : అనుకోని ప్రయాణాలు ఉంటాయి.మిత్రుల నుంచి మాటపడతారు..కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.ఆరోగ్యం మందగిస్తుంది.కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు.దేవాలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు కేసులు  ఎదురవుతాయి.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు మానసిక అశాంతి.ఐటీ నిపుణులకు వివాదాలు పెరుగుతాయి.విద్యార్థులకు చికాకులు.మహిళలకు మానసిక ఆవేదన.షేర్ల విక్రయాలు లాభించవు.అదృష్ట రంగులు....పసుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

మీనం : ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.సన్నిహితులు మరింత దగ్గరవుతారు.మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు .ఐటీ నిపుణులకు మరింత అనుకూల సమయం.విద్యార్థులకు గందరగోళం తొలగుతుంది.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.అదృష్ట రంగులు....గోధుమ, బంగారు.

పరిహారాలు : హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.