(Local) Wed, 20 Oct, 2021

నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 06, 2019,   12:23 PM IST
Share on:
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : పరిచయాలు పెరుగుతాయి.సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.కాంట్రాక్టులు పొందుతారు.సంఘంలో గౌరవమర్యాదలు.సోదరులతో వివాదాలు తీరతాయి.రాబడి పెరిగి ఉత్సాహంగా ముందుకుసాగుతారు.ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు సంతోషదాయక సమాచారం.విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు... పసుపు, కాఫీ.

పరిహారాలు : గణేశ్‌కు అభిషేకం చేయండి.

వృషభం : ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.పాత బాకీలు వసూలవుతాయి.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.రియల్‌ఎస్టేట్‌ల వారు వివాదాల నుంచి గట్టెక్కుతారు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయ,కళారంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.విద్యార్థులకు నూతనోత్సాహం.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు... పసుపు, గులాబీ.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం : మిత్రుల నుంచి విమర్శలు.పనులలో ఒత్తిడులు.దూర ప్రయాణాలు ఉండవచ్చు.పరిస్థితులు అంతగా అనుకూలించవు.వ్యయప్రయాసలు తప్పవు.ఆదాయం కొంత తగ్గుతుంది.కాంట్రాక్టర్లకు లేనిపోని సమస్యలు.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.విద్యార్థులకు అయోమయ పరిస్థితి ఉంటుంది.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం : వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన.ప్రయాణాలలో ఆటంకాలు.పనులు మధ్యలో రద్దు చేసుకుంటారు.పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.రాబడి నిరాశ కలిగిస్తుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారి కృషి ఫలించదు.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు అనుకోని మార్పులు తథ్యం.రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు.ఐటీనిపుణులు ఆచితూచి వ్యవహరించాలి.విద్యార్థులు మరింత శ్రమపడితే ఫలితం ఉంటుంది.మహిళలకు ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలు సామాన్యమే.అదృష్ట రంగులు...తెలుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : నృసింహ స్తోత్రాలు పఠించండి.

సింహం : ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు.ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు.వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది.సన్నిహితుల నుంచి శుభవార్తలు.గృహ,వాహన యోగాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు వివాదాల నుంచి విముక్తి.వ్యాపారాలు సజావుగాసాగుతాయి.ఉద్యోగులకు ఉన్నతస్థితి లభిస్తుంది.విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.మహిళలకు సోదరీలు,సోదరులతో సఖ్యత.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు, గోధుమ.

పరిహారాలు :  శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

కన్య : కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు.ఆకస్మిక ధన లాభం.ప్రముఖుల నుంచి కీలక సమాచారం.సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సంతోషకర సమాచారం.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.ఐటీ నిపుణులు నైపుణ్యాన్ని చాటుకుంటారు.విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి.మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...నీలం, బంగారు.

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

తుల : ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. రుణ దాతల ఒత్తిడులు.అనుకోని ప్రయాణాలు.కష్టపడ్డా ఫలితం ఉండదు.పనులలో ఆటంకాలు చికాకు పరుస్తాయి.బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.కాంట్రాక్టర్లు ఆశించిన అవకాశాలు చేజార్చుకుంటారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగులకు స్థాన మార్పులు.రాజకీయవేత్తలకు కొంత గందరగోళంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు.విద్యార్థులు కొంత ఓపిక వహించాలి.మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు స్వల్పమే.అదృష్ట రంగులు...పసుపు, నీలం.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : బంధు మిత్రులతో అకారణ వైరం.ఉద్యోగావకాశాలు చేజారి నిరాశ కలిగిస్తాయి.దూర ప్రయాణాలు సంభవం.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.ఒప్పందాల్లో ఆటంకాలు.శారీరక రుగ్మతలు.కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కష్టమే మిగులుతుంది.వ్యాపారాలలో లాభాలు కష్టమే.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.విద్యార్థులు కొంత అయోమయానికి లోనవుతారు.మహిళలకు బంధువులతో వైరం.షేర్ల విక్రయాలలో మరింత నిదానం అవసరం.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, లేత ఎరుపు.

పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి.పట్టిన పట్టు వీడకుండా పనులు పూర్తి చేస్తారు.పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి.ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.వాహనయోగం.శుభకార్యాల పై చర్చలు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్ల కృషి ఫలిస్తుంది.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.పారిశ్రామిక,కళారంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు.మహిళలకు ఆస్తి లాభ సూచనలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...ఎరుపు, లేత ఆకుపచ్చ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

మకరం : కొత్తగా రుణ యత్నాలు.దూర ప్రయాణాలు ఉంటాయి.మిత్రులతో కలహాలు.వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.బంధువులను కలుసుకుని కుటుంబవిషయాలు చర్చిస్తారు.శారీరక  రుగ్మతలు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు.రాజకీయ,పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు కొంత గందరగోళంగా ఉంటుంది.విద్యార్థుల యత్నాలు ఫలించవు.మహిళలకు ఆస్తి వివాదాలు నెలకొంటాయి.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు...లేత పసుపు, నీలం.

పరిహారాలు : శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

కుంభం : నూతన విద్యావకాశాలు.ప్రయత్నాలు ఫలిస్తాయి.వాహనాలు, ఆభరణాలు కొంటారు.సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అనుకూల వాతావరణం.వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.పారిశ్రామిక,కళారంగాల వారికి యోగవంతంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు కలిసివచ్చే కాలం.విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి.మహిళలకు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.అదృష్ట రంగులు... ఆకుపచ్చ, నీలం.

పరిహారాలు :  శివాష్టకం పఠించండి.

మీనం : ఆర్థిక పరిస్థితి మందగిస్తుందిబంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు.విద్యార్థులకు కొంత అసంతృప్తి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో లాభాలు, కష్టమే.అదృష్ట రంగులు... ఎరుపు, ఆకుపచ్చ.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.