(Local) Mon, 27 Sep, 2021

నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

November 05, 2019,   11:36 AM IST
Share on:
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఉద్యోగ, వివాహ యత్నాలలో కదలికలు.అందరిలోనూ గౌరవం పొందుతారు.వాహనాలు, స్థలాలు కొంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.గృహం, వాహనాలు కొంటారు.ఉత్సవాలు, వేడుకల్లో చురుగ్గా  పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు లభిస్తుంది.మహిళలకు పురస్కారాలు దక్కుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గోధుమ, తెలుపు.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం : ప్రయాణాలలో ఆటంకాలు.మానసిక ఆందోళన.ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలలో పొరపాట్లు.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పని ఒత్తిడులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరాశాజనకం..ఐటీ నిపుణులకు వివాదాలు పెరుగుతాయి.విద్యార్థులు కొంత సంయమనం పాటించాలి.మహిళలకు కుటుంబసమస్యలు తప్పవు.షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...ఎరుపు, కాఫీ.

పరిహారాలు :  దత్తాత్రేయ పూజలు మంచిది.

మిథునం : ప్రయాణాలు వాయిదా.ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.ఆలోచనలు నిలకడగా ఉండవు.మిత్రులతో కలహాలు.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు.వ్యాపారాలు అంతగా లాభించవు.ఉద్యోగవర్గాలకు  మరింత పనిభారం పెరుగుతుంది.ఐటీ నిపుణులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి.మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.అదృష్ట రంగులు...పసుపు, కాఫీ.

పరిహారాలు :  హనుమాన్‌ చాలీసా పఠించాలి.

కర్కాటకం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.దేవాలయాలు సందర్శిస్తారు.భూములు, వాహనాలు కొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు ఫలిస్తాయి.వ్యాపార లావాదేవీలలో పురోగతి.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.పారిశ్రామికవేత్తలకు చిక్కులు.ఐటీ నిపుణులు అనుకున్న కార్యాలు విజయవంతంగా ముగిస్తారు..విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు అరుదైన సన్మానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...గులాబీ,లేత ఎరుపు.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించాలి.

సింహం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.పలుకుబడి పెరుగుతుంది.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆస్తిలాభం.వ్యాపారాలలో ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగవర్గాలకు అనుకోని  ఇంక్రిమెంట్లు లభిస్తాయి.ఐటీ నిపుణుల సేవలకు గుర్తింపు లభిస్తుంది.విద్యార్థులకు లక్ష్యాలు సాధిస్తారు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు...కాఫీ, పసుపు.

పరిహారాలు :  కనకధారా స్తోత్రం పఠించండి.

కన్య : కుటుంబంలో చికాకులు.ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.శారీరక రుగ్మతలు.తీర్థ యాత్రలు చేస్తారు.దూర ప్రయాణాలు ఉంటాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్యస్థితి.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఊహించని మార్పులు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులకు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి.మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు :  విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

తుల : వ్యయప్రయాసలు.ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు.ఇంటాబయటా ఒత్తిడులు.ఎంతకష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు.భార్యాభర్తల మధ్య విభేదాలు.కాంట్రాక్టర్లకు అవకాశాలు తప్పిపోతాయి.వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలు.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.రాజకీయవేత్తలకు చిక్కులు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు తప్పవు.విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు.మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...పసుపు, గులాబీ.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం : సకాలంలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు.సంఘంలో విశేష గౌరవం, కీర్తి ప్రతిష్టలు పొందుతారు.శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల సాయం అందుతుంది.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.పరిస్థితులు అనుకూలిస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూలత.వ్యాపారాలలో లాభాలు తథ్యం.ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన సమాచారం.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి.మహిళలకు ఆస్తిలాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు..ఎరుపు,తెలుపు.

పరిహారాలు :  అన్నపూర్ణాష్టకం పఠించండి.

ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు.బంధువులు, మిత్రులతో విభేదాలు.దైవ దర్శనాలు.ఆరోగ్య సమస్యలు.పనులు నత్తనడకన సాగుతాయి.వ్యాపారులు ఆలోచించి ముందుకు సాగాలి.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు అయోమయ పరిస్థితి..విద్యార్థులకు అందిన అవకాశాలు సైతం జారిపోతాయి.మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉండదు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు..తెలుపు, గులాబీ.

పరిహారాలు :  ఆంజనేయస్వామిని పూజించండి.

మకరం : నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి.చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.పరిచయాలు మరింత పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి.రాజకీయ,వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు శుభవార్తలు అందుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు..పసుపు, గులాబీ.

పరిహారాలు :  శివ స్తోత్రాలు పఠించాలి.

కుంభం : పనులలో ఆటంకాలు.కష్టపడ్డా ఫలితం కనిపించదు.బంధువులతో కలహాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.బంధువులతో అకారణంగా తగాదాలు.దూర ప్రయాణాలు ఉంటాయి.రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.రాజకీయవర్గాల వారికి నిరుత్సాహమే.విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి.మహిళలకు అనారోగ్య సూచనలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు…లేత ఎరుపు, నీలం.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మీనం : కొత్త కార్యక్రమాలు చేపడతారు.ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.ఆశ్చర్యకరమైన సంఘటనలు.ఆలయాలు సందర్శిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వాహనాలు, ఆభరణాలు కొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి పొరపాట్లు దొర్లుతాయి.వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగులకు పదోన్నతులు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకుS విదేశీ ఆహ్వానాలు.విద్యార్థులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు ఆస్తి లాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు….లేత పసుపు, కాఫీ.

పరిహారాలు :  నృసింహస్వామిని పూజించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.