(Local) Sat, 30 May, 2020

డిసెంబర్,31,2018, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు

December 30, 2018,   10:49 PM IST
Share on:
డిసెంబర్,31,2018, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు

 

మేషం

సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాలలో గోప్యత పాటించాలి. ఆరోగ్య సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రియమైన వారితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చికాకులు తప్పవు. స్నేహితులను కలుసుకుంటారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

 

వృషభం

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యక్తిగత విషయాలలో గోప్యత పాటించాలి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి కలిసివస్తుంది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి ఆత్మీయులు సహకరిస్తారు. 

 

మిథునం

ఇతరుల కోసం అతిగా ఖర్చుచేసే స్వభావాన్ని నియంత్రించుకోవాలి. మహిళల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు పడతారు. దీర్ఘకాలిక పథకాలు, వ్యాపార విస్తరణలో నిర్ణయానికి వస్తారు. క్లిష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆదాయం మెరుగుపడుతుంది. 

 

కర్కాటకం

 

స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించడంతో లబ్ది పొందుతారు. కుటుంబ సభ్యులు మీ అభిరుచికి అనుగుణంగా నడుచుకుంటారు. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోడానికి ప్రయత్నిస్తారు. చేపట్టిన పనులు వాయిదా పడటంతో నిరుత్సాహానికి గురవుతారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు చికాకులు అధికమవుతాయి. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారు. 

 

సింహం

పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా పాటించడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత విషయాల్లో స్నేహితుల జోక్యం ఎక్కువవుతుంది. షాపింగ్ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మహిళలకు పరిచయాలు అధికమవుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సమర్థత, వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగలు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. అపరిచిత వ్యక్తులపట్ల ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఆలయాలను సందర్శిస్తారు. 

 

కన్యా

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఓ వార్తను వింటారు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మహిళలు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నతోద్యోగులకు అధికారిక పర్యటనలు అధికమవుతాయి. 

 

తుల

వినోదం, విలాసాల కోసం చేసే ఖర్చులను నియంత్రించుకోవాలి. సన్నిహితుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు టెండర్లు అనుకూలిస్తాయి. పంతాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాల్సి ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. 

 

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల సలహా పాటిస్తే నష్టపోయే ఆస్కారం ఉంది. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. మహిళలకు కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. బిల్లులు చెల్లిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. 

 

ధనుస్సు

 

పెట్టుబడుల విషయంలో స్వీయ నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. గతంలో చేసిన సహాయం వల్ల లబ్ది పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు అంచనాలకు తగినట్టుగానే ఉంటాయి. పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేస్తారు. సొంత వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. 

మకరం

 

వినోదం, విలాసాల కోసం చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం అన్ని విధాల శ్రేయస్కరం. విద్యార్థుల్లో పట్టుదల, ఏకాగ్రత నెలకొంటాయి. మీడియా ఉద్యోగులకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 

 

కుంభం

మీ అద్భుతమైన మేధాశక్తి అత్యంత లాభాలను కురిపిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాల కోసం పథకాలు రూపొందిస్తారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మహిళలలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రుణ ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. 

మీనం

 

ఒక తప్పుడు సమాచారం మానసిక ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంతో బంధం మరింత బలపడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలవాట్లు, బలహీనతలకు గోప్యంగా ఉంచడం మంచిది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారికి ఆశాజనకంగా ఉంటుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.