(Local) Mon, 23 Sep, 2019

డిసెంబర్,22,2018, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు

December 21, 2018,   10:45 PM IST
Views: 162
Share on:
డిసెంబర్,22,2018, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు

 

మేషం

ఖర్చులు బడ్జెట్ ను మించి ఉండటంతో కొత్త పథకాలు నిలిచిపోతాయి. ఐరన్ రంగం వారికి ఆటంకాలు. కుటుంబంలోనూ ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పైఅధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 

 

వృషభం

మహిళలకు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఆర్థిక లాభాలు ఆశించినంతగా ఉండవు. ఖర్చులు మాత్రం ఊహించని విధంగానే ఉంటాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. మీ నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టి విజయం పొందండి. రాజీమార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. స్త్రీల ప్రతిభకు అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. 

 

మిథునం

మానసిక ఒత్తిడికి గురవుతారు. పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఖర్చులు, ఇతర చెల్లింపులు అధికంగా ఉంటాయి. మీ సేవాదక్షతకు గుర్తింపు లభిస్తుంది. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. 

 

కర్కాటకం

 

పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పత్రిక, ప్రైవేట్ సంస్థలలో వారికి అభద్రతాభావం, ఆందోళన తప్పదు. చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమే. రుణాల కోసం అన్వేషిస్తారు. మహిళల తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులకు స్థానచలనం, బాధ్యతల మార్పు సంభవం. 

 

సింహం

మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. వ్యక్తిగత విషయాలలో గోప్యత పాటించాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు రుణాలను చెల్లిస్తారు. గృహానికి అవసరమైన వస్తువులను సమర్చుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మీ సంకల్పానికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా అవసరం. ఉద్యోగులు పైఅధికారులతో సంభాషించునపుడు మెళకువ అప్రమత్తంగా ఉండాలి. 

 

కన్య

ఆర్థిక వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టసాధ్యం. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. మహిళలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరిగి, ప్రోత్సాహం లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

 

తుల

గతంలో పెట్టుబడులు వల్ల ఇప్పుడు ప్రయోజనం పొందుతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో స్నేహితులు అండగా ఉంటారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బంగారం, వెండి గృహోపకరణాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఓర్పు, సహనంతో వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. హామీలు, చెక్కుల జారీల విషయంలో ఏకాగ్రత వహించాలి. 

 

వృశ్చికం

ఆరోగ్య సమస్యలు అసౌకర్యానికి కారణమవుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు ఆశాజనకంగా ఉంటాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశంతో ధనం విరిగా వ్యయం చేస్తారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఏ ప్రయత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. భార్యభర్తల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. 

 

ధనుస్సు

 

పెట్టుబడుల విషయంలో అంతగా ప్రయోజనం ఉండదు. విశ్రాంతి లేకపోవడంతో నిస్సత్తువ ఆవహిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లాయర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి పై అధికారుల మన్నలను పొందుతారు. 

 

మకరం

 

 

ఊహించని ఆర్థిక లాభాలతో తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయ నాయకుల సభలు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు హడావుడి తొందరపాటు తగదు. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెంటాడుతుంది. మహిళలు తొందరపాటుతనం వల్ల ప్రియమైన వారిని దూరం చేసుకుంటారు. ఎంత ధనం వెచ్చించినా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. 

 

కుంభం

కుటుంబంలో మీ అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. వినోదం, విలాసాలకు ఖర్చుచేసే స్వభావాన్ని నియంత్రించుకోండి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగులు అధిక శ్రమ, ఒత్తిడికి లోనవుతారు. సంఘంలో మంచి, పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 

మీనం

 

పెట్టుబడులను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ప్రేమించే వారితో వివాదాలకు దూరంగా ఉండండి. సేవా సంస్థలకు విరాళాలివ్వడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మహిళలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. లాయర్లు ముఖ్యమైన పత్రాలను అందుకుంటారు.

 
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.