(Local) Mon, 26 Aug, 2019

డిసెంబర్,21,2018, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు

December 20, 2018,   10:51 PM IST
Share on:

 

మేషం

సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అధికమవుతాయి. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు తలెత్తే ఆస్కారం ఉంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కళలు, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. 

 

వృషభం

సామాజిక కార్యక్రమాల్లో పాల్గోవడంతో కొత్త పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రియమైనవారితో విభేదాలు సమసిపోతాయి. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలివిగా తో వ్యవహరించి కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించాలి. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. సకాలానికి ధనం అందడంతో ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 

 

మిథునం

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదే సమయంలో ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. వృత్తిపరంగా ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు ప్రయోజనం నెరవేరుతుంది. భాగస్వామిక ఒప్పందాలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో అవగాహనకు వస్తారు. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. 

 

కర్కాటకం

 

ఉమ్మడి వ్యాపారాలు, ఊహాజనిత పథకాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భార్యభర్తలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. మిమ్మల్ని చిన్నచూపు చూసేవారే మీ సాయం కోసం అర్థిస్తారు. 

 

సింహం

అనారోగ్యం నుంచి బయటపడతారు. ముఖ్యమైన పథకాలు అమలుజరిగి లాభాలు పొందుతారు. అతిగా వ్యవహరించేవారికి దూరంగా ఉండాలి. సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఏకాగ్రత లోపం వల్ల విద్యార్థులకు చికాకులు తప్పవు. ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోతారు. 

 

కన్య

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. అనేక మార్గాల నుంచి ఆదాయం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. వస్త్రాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయాలనే మహిళల కోరికలు నెరవేరతాయి. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 

 

తుల

చుట్టుపక్కల వారికి సహాయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ప్రేమికులు ఇబ్బందులు తప్పవు. గృహవసరాలకు నిధులు సమకూరుతాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యర్ధుల కదలికపై ఓ కన్నేసి ఉంచాలి. భార్యభర్తల గౌరవప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. 

 

వృశ్చికం

ఇతరుల కోసం అతిగా ఖర్చుచేస్తారు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. క్రీడల్లో పాల్గొంటారు. గుర్తింపు, గౌరవం పొందుతారు. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. 

 

ధనుస్సు

 

పెట్టుబడులు, భవిష్యత్తు లక్ష్యాల పట్ల గోప్యత పాటించాలి. క్లిష్ట సమయంలో బంధువుల సాయం అందుతుంది. మీ అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు ఏకీభవించలేరు. ఉపాధ్యాయులకు విద్యార్ధుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఖరీదైన వస్తువుల కొనుగోలులో అంచనాలు మించుతాయి. మీడియా ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. 

 

మకరం

 

 

స్నేహితులతో సంతోషంగా సాగిపోతుంది. కొందరికి ఊహించని ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. గృహంలో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి నిరుత్సాహం తప్పదు. రక్త సంబంధీకుల మధ్య మనస్ఫర్ధలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. 

 

కుంభం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా ఖర్చులు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి నిధుల లేమి అడ్డంకిగా మారుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లాంటి శుభవార్తలు అందుతాయి. విదేశీయానం ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. మహిళలతో సంభాషించేటపుడు సంయమనం పాటించాలి. స్పెక్యులేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. మీ శక్తి సామర్ధ్యాలను ప్రత్యర్ధులు గుర్తిస్తారు. 

మీనం

 

ఖర్చులు పెరిగినా ఆదాయం పుష్కలంగా ఉంటుంది. వ్యక్తిగత రహస్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇతరులతో పోల్చుకోవటం క్షేమం కాదు. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్ధులకు ఆసక్తి సన్నగిల్లుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరదు.

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.