(Local) Mon, 23 Sep, 2019

డిసెంబర్,17,2018,సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు

December 16, 2018,   10:47 PM IST
Views: 154
Share on:
డిసెంబర్,17,2018,సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు

 

మేషం

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోవడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. ప్రైవేట్ ఉద్యోగులు మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో ప్రయివేట్ సంస్థల ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయులకు కొత్త ఆలోచనలు, విద్యార్ధుల్లో మనోధైర్యం పెంపొందుతాయి. ఆరోగ్యం విషయంలో మహిళలకు చికాకులు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. 

 

వృషభం

సృజనాత్మకత నైపుణ్యాలు లబ్ది కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సలహా పాటించడం వల్ల ఫలితం ఉంటుంది. చిన్నారులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రులతో వినోదాలలో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులు, సంస్థల స్థాపనకు కొంత కాలం వేచిఉండటం మంచిది. కొన్ని వ్యవహారాలు వాయిదాపడతాయి. పెద్దల సలహా పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

 

మిథునం

కొత్త ప్రాజెక్టుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు తప్పవు. కుటుంబం, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఎదుటివారితో సంభాషించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హోటల్, కేటరింగ్ రంగాల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉమ్మడి, ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.

 

కర్కాటకం

 

వినోదం, విలాసాలకు చేసే ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. అశ్రద్ధ వల్ల కొన్ని నష్టాలు తప్పవు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సఖ్యతగా మెలిగి మీ పనులు చక్కబెట్టుకుంటారు. బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్మాయం చూసుకోవడం ఉత్తమం. ప్రముఖులను కలుసుకుంటారు. 

 

సింహం

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. కుటుంబంలోని చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. రాజకీయ నాయకులు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారుల్లో నిలదొక్కుకోవడంతో ఆర్థికంగా లాభం ఉంటుంది. 

 

కన్య

ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించాలి. ఎదుటివారికి సహాయం చేసే గుణం గుర్తింపు తీసుకొస్తుంది. బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. శ్రీమతి మొండివైఖరి వల్ల ఆందోళనకు గురవుతారు. 

 

తుల

ఆహారం, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. బంధువులు, స్నేహితుల నుంచి కానుకలు అందుకుంటారు. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించాలి. మహిళల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. అతిథి సత్కరాలు సక్రమంగా నిర్వహిస్తారు. 

 

వృశ్చికం

ఖర్చులు పెరగడంతో ఆందోళన చెందుతారు. సన్నిహితులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. మత్స్య, పాడి పరిశ్రమలకు ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనే మనోవాంఛలు నెరవేరుతాయి. న్నచూపు చూసిన వారే మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. 

 

ధనుస్సు

 

ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులకు అంత అనుకూలమైన రోజు కాదు. ఖర్చులు తగ్గించుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో గోప్యత పాటించాలి. స్థిరాస్తి కొనుగోలుచేయాలనే ఆలోచన బలపడుతుంది. మీ ప్రయత్నాలకు సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. 

 

మకరం

 

 

అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ధనసహాయం అర్థించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయాన కోసం చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు. కళలు, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. 

 

కుంభం

వినోదం, విలాసాలకు చేసే ఖర్చులు వల్ల ఒత్తిడి అధికమవుతుంది. బంధువుల సహాకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. స్థిరాస్తి అమ్మకానికి చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదొడుకులు ఎదురైనా ముఖ్యమైన వారి సహకారంతో సమసిపోతాయి. ప్రేమించే వారి వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

 

మీనం

 

 

 

నిరాశ, నిస్పృహలు ఆవహించడంతో ప్రశాంతత లోపిస్తుంది. పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాల విషయంలో గోప్యత పాటించాలి. బంధువులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో నిరాశకు గురవుతారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. హానికలిగించే స్నేహానికి దూరంగా ఉండాలి. మహిళలు తాము కోరుకున్నవి దక్కించుకోవడానికి ఎంత ఖర్చయినా చేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.

 
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.