(Local) Mon, 17 Jun, 2019

డిసెంబర్,13,2018,గురువారం-రోజువారీ జాతక ఫలితాలు

December 12, 2018,   10:23 PM IST
Share on:

 

మేషం

ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళన లు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

 

వృషభం

ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుం ది. గృహసంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకుంటారు. గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కారమవుతాయి.

 

మిథునం

ఆరోగ్యం, ఆహార విషయాల్లో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శ నం కానీ, ఆధ్యాత్మిక క్షేతాల్ని సందర్శించటం కానీ చేస్తారు.

 

కర్కాటకం

 

ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

 

సింహం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది.

 

కన్య

మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

 

తుల

ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే పయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

 

వృశ్చికం

బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

 

ధనుస్సు

 

మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరో గ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

 

మకరం

 

 

మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

 

కుంభం

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉం చండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

 

మీనం

 

 

 

ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు. దూర ప్రయాణంలో కానీ, ఉద్యోగంలో కానీ మార్పు ఉంటుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.