(Local) Mon, 18 Nov, 2019

ఆగష్టు 29,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

August 29, 2019,   11:26 AM IST
Share on:
ఆగష్టు 29,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : కుటుంబ సభ్యులతో కలహాలు.ఇంటాబయటా ప్రతికూలత.పనులు కొంత మందగిస్తాయి.ఆరోగ్య విషయంలో చికాకులు.బంధువుల నుంచి ఒత్తిడులు.ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది.నిర్ణయాలు వాయిదా వేస్తారు.మీ శ్రమ వృథాగా మారుతుంది.మిత్రుల నుంచి కొత్త సమస్యలు.రియల్‌ఎస్టేట్‌ల వారికి వివాదాలు..వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగులకు శ్రమాధిక్యమే.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు సోదరులతో విభేదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.....గులాబీ, లేత పసుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.భూ వివాదాలు చికాకు పరుస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.శారీరక రుగ్మతలు.ఉద్యోగులకు స్థానచలనం. రాజకీయ, కళారంగాల వారికి గందరగోళంగా ఉంటుంది.మహిళలు మానసిక ఆందోళన చెందుతారు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, ఎరుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మిథునం : కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఆకస్మిక ప్రయాణాలు.ఆలయాలు సందర్శిస్తారు.బంధువర్గంతో విరోధాలు.ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.వ్యాపారాలు నామమాత్రంగా సాగుతాయి.రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు..... నీలం, గోధుమ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : పరిస్థితులు అనుకూలిస్తాయి.సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ఆస్తి వివాదాల పరిష్కారం.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.వాహన యోగం.పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.విద్యార్థులు ఆశించిన అవకాశాలు పొందుతారు.మహిళలకు కుటుంబంలో సమస్యలు తీరతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు.....కాఫీ, ఎరుపు.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

సింహం : పరిస్థితులు అనుకూలించవుపనులలో ప్రతిష్ఠంభన.మిత్రుల నుంచి విమర్శలు తప్పవు.కొద్దిపాటి శారీరక రుగ్మతలు.బంధువులతో వైరం.ఆస్తుల విషయంలో సోదరులతో వివాదాలు.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.విద్యార్థులకు శ్రమ తప్పదు.మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు..... తెలుపు, గులాబీ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కన్య : వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.పరిస్థితులు అనుకూలిస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.శత్రువులను సైతం ఆకట్టుకుంటారు.సోదరులు, మిత్రులతో సఖ్యత.భూ, గృహ యోగ సూచనలు.రియల్‌ఎస్టేట్‌ల వారికి వివాదాలు తీరతాయి.విద్యార్థులు విజయాల బాటలో నడుస్తారు.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు.....పసుపు, గులాబీ

పరిహారాలు : రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

తుల : బంధువుల  నుంచి శుభవార్తలు.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం.ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.ఏ పని చేపట్టినా విజయమే.అంచనాలు నిజమవుతాయి.ఐటీ నిపుణులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు.మహిళలకు భూలాభాలు కలుగుతాయి.షేర్ల విక్రయాలలో కొద్దిపాటి లాభాలు.అదృష్ట రంగులు.....పసుపు, గులాబీ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.మిత్రులతో కొద్దిపాటి విరోధాలు.శ్రమ పెరుగుతుంది.నిర్ణయాలలో కొంత నిదానంగా సాగండి.పెద్దల సలహాలు స్వీకరిస్తారు.ముఖ్యమైన కాంట్రాక్టులు చేజారతాయి.వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.మహిళలకు కుటుంబంలో సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు..... ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ధనుస్సు : కుటుంబంలో చికాకులు.ఆర్థిక ఇబ్బందులు.ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి.ముఖ్య కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.పాతమిత్రులను కలుసుకుంటారు.ఒక ఆహ్వానం కొంత ఉత్సాహాన్నిస్తుంది.కాంట్రాక్టర్లకు ఒత్తిడులు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగులకు చికాకులు తప్పవు.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.షేర్ల విక్రయాలు సామాన్యమే.అదృష్ట రంగులు.....గోధుమ,కాఫీ.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మకరం : చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు.ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.శత్రువులు మిత్రులుగా మారతారు.కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆలయాలు సందర్శిస్తారు.పలుకుబడి కలిగినవారితో పరిచయాలు.ఆలోచనలు కలసివస్తాయి.కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు.వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.విద్యార్థులకు కృషి ఫలిస్తుంది.మహిళలకు సోదరులు,సోదరీల నుంచి ఆహ్వానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు..... నీలం, కాఫీ.

పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కుంభం : ఇంటాబయటా ప్రోత్సాహం.నూతన ఉద్యోగాలు దక్కుతాయి.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.పాత మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.అదనపు ఆదాయం సమకూరుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారి యత్నాలు ఫలిస్తాయి.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు,ఇంక్రిమెంట్లు లభిస్తాయి.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు మరింత ప్రోత్సాహం.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలు శుభవార్తలు వింటారు.షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు రాగలవు.అదృష్ట రంగులు.....తెలుపు, కాఫీ.

పరిహారాలు : గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

మీనం : వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబంలో చికాకులు.బంధువులతో విరోధాలు.శ్రమ తప్ప ఫలితం కనిపించదు.దూర ప్రయాణాలు.సంగీత, సాహిత్యాల పై ఆసక్తి.ఆలయ దర్శనాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొంత అనుకూల వాతావరణం.భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు.విద్యార్థులకు చికాకులు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : విష్ణు ధ్యానం చేయండి.

సంబంధిత వర్గం
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.