(Local) Mon, 20 Sep, 2021

ఆగష్టు 28,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

August 28, 2019,   10:34 AM IST
Share on:
ఆగష్టు 28,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం: బంధువర్గంతో అకారణంగా వివాదాలు.ఆదాయానికి మించి ఖర్చులు తప్పవు.ఇంటాబయటా కొన్ని సమస్యలు వేధిస్తాయి.చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు.అనారోగ్యం, ఔషధ సేవనం.ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి చిక్కులు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది..రాజకీయ, కళారంగాల వారికి మానసిక అశాంతి.నిపుణులకు కొంత నిరుత్సాహమే.విద్యార్థులు కొన్ని అవకాశాలు జారవిడుచుకుంటారు.మహిళలకు కొంత గందరగోళం.అదృష్ట రంగులు.....ఎరుపు,తెలుపు.

పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం : ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.నూతన విషయాలు తెలుసుకుంటారు.ఆప్తులతో వివాదాలు పరిష్కారం.శుభకార్యాల్లో పాల్గొంటారు.మిత్రుల నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.శ్రమ పడ్డా ఆశించిన  ఫలితం కనిపిస్తుంది.పనులలో ముందడుగు వేస్తారు.కాంట్రాక్టర్లు, రియల్టర్ల కృషి ఫలిస్తుంది.విద్యార్థులకు సాంకేతిక విద్యలలో అవకాశాలు.మహిళలకు మానసిక ప్రశాంతత.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, గులాబీ.

పరిహారాలు : శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

మిథునం :వ్యయ ప్రయాసలు.ఆదాయం కొంత తగ్గుతుంది.బంధువులతో అకారణంగా విరోధాలు.కష్టమే తప్పితే ఫలితం కనిపించదు.జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.పనుల్లో కొంత జాప్యం.ప్రయాణాల్లో ఆటంకాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొద్దిపాటి చిక్కులు.వ్యాపారాలు మందకొడిగాసాగుతాయి.విద్యార్థులకు శ్రమాధిక్యం.మహిళలకు సోదరుల నుంచి కొత్త సమస్యలు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, పసుపు.

పరిహారాలు :  ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం : దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులు మరింత సహాయ పడతారు.గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగలాభం.వాహన, గృహయోగాలు.ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి శుభవర్తమానాలు.మహిళలకు ఆస్తి వివాదాల పరిష్కారం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.....ఎరుపు, బంగారు.

పరిహారాలు :  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం : ఇంటాబయటా కొన్ని సమస్యలు వేధిస్తాయి.బంధువులతో కలహాలు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.సన్నిహితుల నుంచి ఒత్తిడులు తప్పవు..కాంట్రాక్టర్ల యత్నాలు ముందుకు సాగవు.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు మందగిస్తాయి..అదృష్ట రంగులు.....నీలం, పసుపు.

పరిహారాలు :  నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 

కన్య : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం.శుభకార్యాల్లో ఉత్సాహంగా  పాల్గొంటారు.కీలక చర్చల్లో పురోగతి.ఇంటాబయటా అనుకూల పరిస్థితులు.చిన్ననాటి మిత్రుల కలయిక.ఆలయ దర్శనాలు.రాబడి కొంతమేర పెరుగుతుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒత్తిడుల నుంచి విముక్తి.ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి.మహిళలకు శుభవార్తలు.షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు.అదృష్ట రంగులు.....ఆకుపచ్చ, ఎరుపు.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.

తుల : నూతన పరిచయాలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో వివాదాలు తీరతాయి.ఆలోచనలు కలసివస్తాయి.తీర్థయాత్రలు చేస్తారు.వాహనాలు, స్థలాలు కొంటారు.భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.విద్యార్థులు సత్తా చాటుకుంటారు.మహిళలకు సోదరుల నుంచి పిలుపు రావచ్చు.షేర్ల విక్రయాలలో లాభాలు..అదృష్ట రంగులు.....ఎరుపు, కాఫీ.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం : ఆర్థిక ఇబ్బందులు ఎదురై  రుణాలు చేస్తారు.కుటుంబంలో చికాకులు తప్పవు.కష్టపడ్డా ఫలితం కనిపించదు.వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.బంధువులు,మిత్రుల నుంచి విమర్శలు.ఉద్యోగులకు స్థానమార్పులువిద్యార్థులు కష్టానికి ఫలితం దక్కక డీలా పడతారు.మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది.షేర్ల విక్రయాలలో తొందరవద్దు.అదృష్ట రంగులు.....గులాబీ, తెలుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు : ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.వివాదాలకు మరింత దూరంగా ఉండండి.ఆప్తులతో విభేదాలు నెలకొంటాయి.శారీరక రుగ్మతలు.ఆలయాల సందర్శనం.ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి.విద్యార్థులు నిర్ణయాలలో నిదానం పాటించాలి.మహిళలకు సోదరులతో వివాదాలు.షేర్ల విక్రయాలలో కొద్దిపాటి లాభాలు.అదృష్ట రంగులు.....గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం : ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.పనుల్లో విజయం సాధిస్తారు.పాత మిత్రులను కలుసుకుంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు.గృహం, వాహనాలు కొంటారు.ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.పరిచయాలు విస్తృతమవుతాయి.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి.అదృష్ట రంగులు.....గులాబీ, లేత పసుపు.

పరిహారాలు : కనకధారా స్తోత్రాలు పఠించండి.

కుంభం : కొత్త విషయాలు తెలుసుకుంటారు.నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం.ఆప్తులతో వివాదాలు పరిష్కారం.శుభకార్యాల్లో పాల్గొంటారు.రాబడి ఆశించిన విధంగా పెరుగుతుంది.వస్తు లాభాలు.కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు సఫలం.ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు.వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు.....ఎరుపు, పసుపు.

పరిహారాలు : శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

మీనం : ఆకస్మిక ప్రయాణాలు.బంధువుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు.ఆర్థికంగా ఒడిదుడుకులు, రుణయత్నాలు.మిత్రులే శత్రువులుగా మారి ఇబ్బందులు కలిగిస్తారు.ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధసేవనం.కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగాల్లో అనుకోని మార్పులు.రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త సమస్యలు.ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.....ఎరుపు, పసుపు.

పరిహారాలు : శివపంచాక్షరి పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.