(Local) Mon, 13 Jul, 2020

ఆగష్టు 27,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

August 27, 2019,   10:34 AM IST
Share on:
ఆగష్టు 27,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : ఒక సమస్య నుంచి బయటపడతారు.ఆలోచనలు అమలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వ్యాపారాలలో పురోగతి.ఉద్యోగులకు ఉన్నతస్థాయి దక్కవచ్చు.రాజకీయవర్గాలకు ఆశించిన ప్రగతి కనిపిస్తుంది.ఐటీ నిపుణులకు మరింత అనుకూలత.విద్యార్థులకు కొత్తవిద్యావకాశాలు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, కాఫీ.

పరిహారాలు : గణపతిని పూజించండి. 

వృషభం : ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.కుటుంబ సమస్యలు వేధిస్తాయి.వివాదాలకు దూరంగా ఉండండి.సన్నిహితులతో విభేదాలు ఏర్పడవచ్చు.కీలక నిర్ణయాలలో తొందర వద్దు.శారీరక రుగ్మతలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఇబ్బందులు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలు ఆరోగ్యపరమైన చికాకులు.షేర్ల విక్రయాలు నిరాశకలిగిస్తాయి.అదృష్ట రంగులు....గులాబీ, పసుపు.

పరిహారాలు : రామరక్షా స్తోత్రాలు పఠించండి.

మిథునం : ఆర్థిక ప్రగతి ఉంటుంది.నూతన వ్యక్తుల పరిచయం.బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.ఆస్తి వివాదాల పరిష్కారం.ఇంటాబయటా అనుకూలస్థితి.ఆలయాలు సందర్శిస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.రాజకీయవర్గాలకు పదవీయోగం.ఐటీ నిపుణులకు మరింత గుర్తింపు.విద్యార్థులు అవకాశాలు అనుకోకుండా దక్కుతాయి.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు....కాఫీ, పసుపు.

పరిహారాలు : నృసింహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : ఆకస్మిక ప్రయాణాలు.ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు.భార్యాభర్తల మధ్య వివాదాలు.శ్రమకు తగిన ఫలితం దక్కక డీలా పడతారు.రాబడి తగ్గి నిరాశ చెందుతారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి కొన్ని సమస్యలు వేధిస్తాయి.వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.మహిళలకు ఆరోగ్యసమస్యలు.షేర్ల విక్రయాలు నిరాశకలిగిస్తాయి.అదృష్ట రంగులు....కాఫీ, బంగారు.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.

సింహం : ఉద్యోగ యత్నాలు సానుకూలం.ప్రముఖులతో పరిచయాలు.ఆలోచనలు అమలు చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు మరింత పొందుతారు.భూ వివాదాలు కొలిక్కి వస్తాయి.వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు.ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు రాగలవు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.విద్యార్థులకు అనుకోని అవకాశాలు.మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు....తెలుపు,పసుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి. 

కన్య : కార్య జయం.ఇంటి నిర్మాణాలు చేపడతారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.శుభకార్యాల్లో పాల్గొంటారు.విచిత్రమైన సంఘటనలు.వాహన యోగం.రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే సూచనలు.రాజకీయవేత్తలు, కళాకారులకు  యోగదాయకమైన కాలం.ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు.మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....పసుపు, గోధుమ.

పరిహారాలు : అన్నపూర్ణాష్టకం  పఠించండి.

తుల : కుటుంబంలో చికాకులు.కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు.వివాదాలకు దూరంగా ఉండండి.భార్యాభర్తల మధ్య లేనిపోని విభేదాలు.అనుకోని ప్రయాణాలు.శ్రమ మరింతగా పెరుగుతుంది.ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు.ఐటీ నిపుణులకు మానసిక అశాంతి.విద్యార్థులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు.మహిళలకు అనారోగ్యం.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....లేత పసుపు, గులాబీ.

పరిహారాలు :  విష్ణు ధ్యానం చేయండి.

వృశ్చికం : ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.పనులలో ప్రతిబంధకాలు.ఆప్తుల నుంచి సమస్యలు. నిరుద్యోగుల అంచనాలు తారుమారు.బంధువర్గంతో అకారణంగా తగాదాలు.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.కుటుంబంలో చికాకులు.రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.వ్యాపారులు నిదానం పాటించాలి.ఐటీ నిపుణులు విధుల్లో మరింత అప్రమత్తత పాటించాలి.విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....నీలం, కాఫీ.

పరిహారాలు : రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు.ఆప్తుల సలహాలు పాటిస్తారు..సంఘంలో విశేష గౌరవం.పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.ఆలోచనలు అమలు చేస్తారు.భార్యాభర్తల మధ్య స్పర్థలు తొలగుతాయి.ఆకస్మిక ధనలాభం.రియల్‌ఎస్టేట్‌ల వారు మరిన్ని లాభాలు ఆర్జిస్తారు.విద్యార్థులకు అరుదైన పురస్కారాలు.మహిళలకు ఇంటాబయటా గౌరవం పెరుగుతుంది.అదృష్ట రంగులు....కాఫీ, ఆకుపచ్చ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం : దూరపు బంధువుల కలయిక.ఇంటాబయటా ప్రోత్సాహం.ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.వాహనాలు, స్థలాలు కొంటారు.రాజకీయవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు శుభవార్తలు.విద్యార్థులకు కృషి ఫలిస్తుంది.మహిళలకు శుభవర్తమానాలు.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కుంభం : అనుకోని ప్రయాణాలు.వ్యయ ప్రయాసలు తప్పవు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి.ఆత్మీయులతో తగాదాలు ఏర్పడతాయి..శారీరక రుగ్మతలు.నిరుద్యోగులకు పరిస్థితులు అనుకూలించవు.మిత్రులు శత్రువులుగా మారతారు.కాంట్రాక్టర్లు ఆచితూచి ముందుకు సాగడం మంచిది.వ్యాపారాలలో కొంత అసంతృప్తి.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.పారిశ్రామిక,రాజకీయవర్గాలకు  వివాదాలు.ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారతాయి.విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి.మహిళలు కుటుంబంలో రాజీపడక తప్పనిపరిస్థితి.షేర్ల విక్రయాలు స్వల్పంగా ఉంటాయి.అదృష్ట రంగులు....కాఫీ,ఎరుపు.

పరిహారాలు : అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం : రుణ దాతల ఒత్తిడులు.వ్యవహారాలలో ఆటంకాలు.దూరప్రయాణాలు.ముఖ్యమైన కార్యక్రమాలు కాస్త మందగిస్తాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు పెరుగుతాయి.ఐటీ నిపుణులకు వివాదాలు తప్పకపోవచ్చు.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు నిరాశ కలిగిస్తాయి.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, ఎరుపు.

పరిహారాలు :  లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.