(Local) Tue, 26 Oct, 2021

ఆగష్టు 21,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

August 21, 2019,   10:16 AM IST
Share on:
ఆగష్టు 21,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : నూతన పరిచయాలు.అందరిలోనూ గుర్తింపు.ప్రముఖుల నుంచి కీలక సమాచారం.కొత్త ఆశలు చిగురిస్తాయి.ఆర్థిక లావాదేవీలు ఆశాజనకమే.ఐటీ నిపుణులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ యానం.విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.మహిళలు శుభవర్తమానాలు అందుతాయి.అదృష్ట రంగులు....ఎరుపు, గోధుమ.

పరిహారాలు :  శివాలయంలో అభిషేకం చేయించుకోండి.

వృషభం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.భూ వివాదాలు చికాకు పరుస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.శారీరక రుగ్మతలు.ఉద్యోగులకు స్థానచలనం. రాజకీయ, కళారంగాల వారికి గందరగోళంగా ఉంటుంది.మహిళలు మానసిక ఆందోళన చెందుతారు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, ఎరుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మిథునం : నూతన ఉద్యోగ యోగం.కుటుంబంలో శుభకార్యాలు.సన్నిహితుల సాయంతో పనులు పూర్తి.సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.జీవితభాగస్వామి నుంచి ధన, ఆస్తి లాభాలు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.కాంట్రాక్టర్లు, రియల్టర్లకు శుభసూచనలే.కళాకారులు, రాజకీయవర్గాలకు అనుకోని సన్మానాలు.ఐటీ నిపుణులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు.విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి.మహిళలు సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు.అదృష్ట రంగులు....ఎరుపు, పసుపు.

పరిహారాలు :  గణపతిని పూజించండి.

కర్కాటకం : పలుకుబడి పెరుగుతుంది.సన్నిహితులతో చర్చలు జరుపుతారు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ఆస్థి విషయాల్లో చికాకులు అధిగమిస్తారు.ఆదాయం పెరుగుతుంది.ఐటీ నిపుణులకు సంతోషకదాయకమైన సమాచారం.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు.... ఎరుపు, గులాబీ.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజించండి.

సింహం : కుటుంబ సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి.ఆదాయం కంటే ఖర్చులు మరింత పెరుగుతాయి.బంధువుల నుంచి సమస్యలు తప్పవు. దూర ప్రయాణాలు చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు తప్పుతాయి.కళాకారులు, రాజకీయవర్గాలకు నిరుత్సాహం.విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారుమహిళలకు ఇంటాబయటా సమస్యలు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....గోధుమ, నీలం.

పరిహారాలు : శివాష్టకం పఠించండి.

కన్య : ఆకస్మిక ప్రయాణాలు.పనుల్లో ప్రతిబంధకాలు.వ్యయప్రయాసలు.రాబడి తగ్గే సూచనలు.నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి.అనుకోని ప్రయాణాలు.సన్నిహితులు, బంధువులతో తగాదాలు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకంగా ఉంటుంది.వ్యాపార లావాదేవీలు కొంత అనుకూలం..విద్యార్థుల అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.మహిళలకు కుటుంబ సమస్యలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....తెలుపు, కాఫీ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

తుల : దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు.ఆలోచనలు అమలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమయానికి పనులు పూర్తి చేస్తారు.ఆదాయం కొంత పెరుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహం.వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.మహిళలకు ఆస్తి లాభాలు.అదృష్ట రంగులు....గులాబీ,పసుపు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

వృశ్చికం : ప్రముఖులతో పరిచయాలు.ఒక సమచారం సంతోషం కలిగిస్తాయి.అదనపు ఆదాయం సమకూరుతుంది.  ప్రత్యర్థుల నుంచి సైతం ఆహ్వానాలు.ఇల్లు, స్థలాలు కొనుగోలు చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు కేసుల నుంచి విముక్తి.వ్యాపారులకు మరింత లాభసాటిగా సాగుతాయి.మహిళలకు శుభ వర్తమానాలు.అదృష్ట రంగులు....బంగారు, ఆకుపచ్చ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు : ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.బంధువులతో అకారణంగా తగాదాలు.కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత.శారీరక రుగ్మతలు.ఆలయాలు సందర్శిస్తారు.ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు.కాంట్రాక్టర్లకు కొన్ని అవకాశాలు చేజారవచ్చు.వ్యాపారాలు మరింత నత్తనడకన సాగుతాయి.మహిళలకు అన్నింటా నిరాశ.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు...తెలుపు, గులాబీ.

పరిహారాలు : దత్తాత్రేయుని పూజలు చేయండి.

మకరం : మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబ సభ్యులతో విభేదాలు.దూర ప్రయాణాలు ఉంటాయి.శారీరక రుగ్మతలు.ఆలయాలు సందర్శిస్తారు.కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు ముందుకు సాగవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు కొంత ఆందోళన కలిగిస్తుంది.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గులాబీ.

పరిహారాలు : దత్తాత్రేయ పూజలు చేయండి..

కుంభం : వ్యవహారాల్లో విజయం.కుటుంబ సభ్యుల నుంచి మరింత ప్రోత్సాహం.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆలోచనలు అమలు చేస్తారు.రాబడి మరింత పెరుగుతుంది.రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆస్తి విషయంలో ఒప్పందాలు.ఉద్యోగాల్లో పదోన్నతులు.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వనాలు అందుతాయి.ఐటీ నిపుణులకు మరింత ప్రోత్సాహం.విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.మహిళలకు కొన్ని సమస్యల నుంచి విముక్తి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, తెలుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

మీనం : ఆకస్మిక ప్రయాణాలు.కుటుంబంలో ఒత్తిడులు.బంధువులు, మిత్రులతో విభేదాలు.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు.ఉద్యోగులు బాధ్యతలు పెరిగి మరింత  శ్రమపడాలి.కళాకారులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు.ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు.మహిళలకు నిరుత్సాహం తపు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటుంది.అదృష్ట రంగులు....ఎరుపు, పచ్చ.

పరిహారాలు : గణపతిని పూజించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.