(Local) Fri, 22 Oct, 2021

ఆగష్టు 17,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

August 17, 2019,   11:23 AM IST
Share on:
ఆగష్టు 17,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.సంఘంలో గౌరవం పెరుగుతుంది.సన్నిహితులతో సఖ్యత.విలువైన వస్తువులు,స్థలాలు కొంటారు.రాబడి మరింతగా పెరుగుతుంది.రియల్‌ ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.వ్యాపారాలలో పురోభివృద్ధి.విద్యార్థులకు నూతనోత్సాహం.మహిళలకు శుభ వార్తలు అందుతాయి.అదృష్ట రంగులు...పసుపు, ఎరుపు.

పరిహారాలు : శ్రీ రామ స్తోత్రం పఠించండి.

వృషభం : నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు.పాత బాకీలు వసూలవుతాయి.కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహం.వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి.విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు.అదృష్ట రంగులు....గులాబీ, కాఫీ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం : వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు.అనుకోని ఖర్చులు. ఆదాయం తగ్గుతుంది.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఇబ్బందులు.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొంత నిరాశాజనకం.విద్యార్థులకు అనుకున్న అవకాశాలు తప్పిపోతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం : మిత్రులతో విరోధాలు.ఆదాయానికి మించి ఖర్చులు.ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు.దూర ప్రయాణాలు ఉంటాయి.శారీరక రుగ్మతలు.రియల్‌ఎస్టేట్‌ల వారి యత్నాలు ముందుకు సాగవు.వ్యాపారాలలో తొందరపాటు వద్దు.ఉద్యోగస్తులకు విధుల్లో ఒత్తిడులు తప్పవు.రాజకీయ, పారిశ్రామికవర్గాల వారికి చిక్కులు.విద్యార్థుల కృషి ఫలించదు.మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....ఎరుపు, కాఫీ.

పరిహారాలు : గణపతికి అర్చన చేయించుకోండి.

సింహం : దూరపు బంధువుల నుంచి శుభవార్తలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.పనులు చకచకా సాగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.చిరకాల మిత్రులను కలుసుకుంటారు.రియల్‌ఎస్టేట్‌ల వారు అనుకున్న ప్రగతి సాధిస్తారు.వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.పారిశ్రామిక,రాజకీయవేత్తలకు విజయాలు చేకూరతాయి.విద్యార్థులకు శుభవర్తమానాలు.మహిళలకు ఆశ్చర్యకరమైన సమాచారం.అదృష్ట రంగులు....తెలుపు, బంగారు.

పరిహారాలు :  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య : దూరపు బంధువులను కలుసుకుంటారు.చాలా విషయాలలో  కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.ఇంటిలో శుభ కార్యాలు నిర్వహసిస్తారు.తీర్థ యాత్రలు చేస్తారు.నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం.కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు.వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు.విద్యార్థులు అంచనాలు నిజం చేసుకుంటారు.మహిళలకు సోదరులతో విభేదాలు తొలగుతాయి.అదృష్ట రంగులు....తెలుపు, ఎరుపు.

పరిహారాలు : అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

తుల : ఆకస్మిక ప్రయాణాలు.కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది.ప్రత్యర్థులు సమస్యలు సృష్టించవచ్చు.ఆరోగ్య, కుటుంబ సమస్యలు.వివాదాలకు దూరంగా ఉండండి.శారీరక రుగ్మతలు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.ఉద్యోగాలలో చికాకులు తప్పవు.ఐటీ నిపుణులు మరింత కష్టపడాలి..విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం అందదు.మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు తప్పవు.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, పసుపు.

పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : ఆకస్మిక ప్రయాణాలు.ఆర్థిక ఇబ్బందులు.మిత్రులు, బంధువర్గంతో విరోధాలు.శ్రమ తప్ప ఫలితం కనిపించదు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆలయ దర్శనాలు.కాంట్రాక్టులు చేజారతాయి.ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు.విద్యార్థులు నిర్ణయాలలో తొందరపడరాదు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించాలి.అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.

పరిహారాలు : కనకధారా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : కొత్త మిత్రుల కలయిక.ఇంటిలో శుభకార్యాలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల సహకారంతో పనులు చక్కదిద్దుతారు.ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి.నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.రియల్‌ఎస్టేట్‌ల వారికి అనూహ్యమైన లాభాలు.కళాకారులకు సన్మానాలు జరుగుతాయి.ఐటీ నిపుణులకు అనుకోని అవకాశాలు తథ్యం.షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.అదృష్ట రంగులు...నలుపు, పసుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మకరం : ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.మిత్రులే శత్రువులుగా మారవచ్చు.కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి.ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి.విద్యార్థులకు కృషి ఫలించదు.మహిళలు కుటుంబ విషయాలపై మరింత శ్రద్ధ చూపాలి.అదృష్ట రంగులు...నీలం, తెలుపు.

పరిహారాలు : గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

కుంభం : ఆకస్మిక ధన లాభం, రాబడి పెరుగుతుంది.అప్రయత్న కార్యసిద్ధి.విలువైన సమాచారం.కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి.ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి..ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.ఐటీ నిపుణులకు అవార్డులు.విద్యార్థుల అంచనాలు నిజమయ్యే సమయం.మహిళలకు భూలాభం.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఆకుపచ్చ.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం : ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.దూర ప్రయాణాలు.నిరుద్యోగులకు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.పనులలో ప్రతిబంధకాలు.సోదరులు, మిత్రులతో కలహాలు.ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు.రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులకు పరిశోధనలు అనుకూలించవు.మహిళలకు నిరాశాజనకంగా ఉంటుంది.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  ఆదిత్య హృదయం పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.