(Local) Sun, 19 Sep, 2021

ఆగష్టు 14,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

August 14, 2019,   11:58 AM IST
Share on:
ఆగష్టు 14,2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..

మేషం : పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.పాతసంఘటనలు గుర్తుకు వస్తాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.సభలు, సమావేశాలలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారి కలలు నెరవేరతాయి.భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....పసుపు, ఆకుపచ్చ.

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం : వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.ఆదాయం అంతగా కనిపించదు.ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.శారీరక రుగ్మతలు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్‌ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి.ఉద్యోగులకు మార్పులు తథ్యం.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు..విద్యార్థులకు లేనిపోని ఒత్తిడులు.మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది.అదృష్ట రంగులు....ఎరుపు, తెలుపు.

పరిహారాలు : దుర్గాదేవిని పూజించండి.

మిథునం : పనుల్లో అవరోధాలు.నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.అనుకోని ఖర్చులు ఎదురవుతాయి..రాబడి తగ్గి నిరుత్సాహం చెందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.ఉద్యోగులకు చికాకులు తప్పవు.ఐటీ నిపుణులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో తొందవద్దు.అదృష్ట రంగులు....నీలం,తెలుపు.

పరిహారాలు : గణపతి స్తోత్రాలు పఠించండి..

కర్కాటకం : బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతాయి.భూవివాదాల నుంచి బయటపడతారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.పారిశ్రామికవర్గాలకు కొన్ని అవాంతరాలు తొలగుతాయి.ఐటీ నిపుణులకు పురస్కారాలు అందుతాయి.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.అదృష్ట రంగులు....తెలుపు, గోధుమ.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి..

సింహం : కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది.మిత్రులు మీ అభివృద్ధికి సహకరిస్తారు.నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.మహిళలకు శుభ వర్తమానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

పరిహారాలు : నరసింహస్వామిని పూజించండి.

కన్య : దూర ప్రయాణాలు చేస్తారు.శ్రమ తప్పదు.బంధువులతో తగాదాలు.ఆదాయం అంతగా కనిపించదు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు.ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.పారిశ్రామికవర్గాలకు నిరాశ కలిగిస్తాయి.విద్యార్థులకు గందరగోళం తప్పదు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు....గులాబీ, లేత ఆకుపచ్చ.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

తుల: ఆర్థిక వ్యవహారాలలో మరిన్ని చిక్కులు.బంధువర్గంతో తగాదాలు.శ్రమకు తగ్గ ఫలితం కష్టమే.సన్నిహితుల నుంచి సమస్యలు.పనులలో ఆటంకాలు తప్పవు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.పారిశ్రామికవేత్తలకు Sచికాకులు తప్పవు.ఐటీ నిపుణులు బాధ్యతలు పెరిగి ఇబ్బందిపడతారు.విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకూ ఫలితంసాధిస్తారు.మహిళలకు కుటుంబసభ్యులతోవిభేదాలు..అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

వృశ్చికం : ఉద్యోగ యత్నాలు అనుకూలించవచ్చు.ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు.సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది.ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.వేడుకలు, సభలలో పాల్గొంటారు..రియల్‌ఎస్టేట్‌ల వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి.పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు సమస్యల నుంచి విముక్తి.విద్యార్థులకు అనుకోని విదేశీ విద్యావకాశాలు.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు : పనులలో ఆటంకాలు చికాకులు తప్పవు.ఇంటాబయటా కొంత ఆందోళన.రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.ఆకస్మిక ప్రయాణాలు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.కాంట్రాక్టర్లకు వివాదాలు.వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిరాశ కలిగిస్తాయి.పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితి.మహిళలకు కుటుంబంలో వివాదాలు.షేర్ల విక్రయాలు మందకొడిగా ఉంటాయి..అదృష్ట రంగులు....బంగారు, కాఫీ.

పరిహారాలు : దక్షిణామూర్తి స్తోతాలు పఠించండి.

మకరం : కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది.నిర్ణయాలలో బంధువుల సలహాలు పాటిస్తారు.స్థలాలు, వాహనాలు కొంటారు.మీ ఊహలు నిజం కాగలవు.రియల్‌ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులకు కార్యజయం, ప్రశంసలు.రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి.విద్యార్థులకు అనుకోని అవకాశాలు.అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.

పరిహారాలు : సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించుకోండి.

కుంభం : పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.ఆదాయానికి మించి ఖర్చులు.వాహనాలు, భూముల  కొనుగోలు యత్నాలు వాయిదా.రియల్‌ఎస్టేట్‌ల వారి యత్నాలు కొంత వరకూ ఫలిస్తాయి.వ్యాపారులకు అంతగా అనుకూలించదు.ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే సూచనలు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు ఎదురై గందరగోళం కలిగించవచ్చు.విద్యార్థులు అవకాశాన్ని చేజార్చుకుంటారు.మహిళలకు ఆరోగ్య సమస్యలు.షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

పరిహారాలు :  హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మీనం : శుభకార్యాల యత్నాలు సానుకూలం.సంఘంలో గౌరవం పొందుతారు.కుటుంబ సమస్యలు తీరతాయి.దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయిఉద్యోగాల్లో తగిన గుర్తింపు లభిస్తుంది.పారిశ్రామికవేత్తలకు విదేశీయానం తథ్యం.ఐటీ నిపుణులకు మరింత అనుకూల పరిస్థితులు.విద్యార్థులు అనుకూల ఫలితాలతో ముందడుగు వేస్తారు.మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.అదృష్ట రంగులు....నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.