(Local) Mon, 25 Oct, 2021

ఆగష్టు 13,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు

August 13, 2019,   10:23 AM IST
Share on:
ఆగష్టు 13,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు

మేషం : చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పదిమందిలోనూ గుర్తింపు రాగలదు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు..భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి..విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు. అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.

పరిహారాలు : హనుమాన్‌ పూజలు మంచిది.

వృషభం :  పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.. ఆప్తులతో తగాదాలు ఏర్పడతాయి. శారీరక రుగ్మతలు. పారిశ్రామికవేత్తలు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. అదృష్ట రంగులు....బంగారు, ఎరుపు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం : దూర ప్రయాణాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. అంచనాలు తప్పి కొంత ఆందోళన చెందుతారు. అనారోగ్య సూచనలు.. రాబడి అంతగా లేక రుణాలు చేస్తారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆస్తి వివాదాలు . వ్యాపార విస్తరణయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులతో పాటు కొందరికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొద్దిపాటి చికాకులు. విద్యార్థులు మరింత కృషి చేయాలి. షేర్ల విక్రయాలలో తొందరవద్దు. అదృష్ట రంగులు....గోధుమ, నీలం.

పరిహారాలు : గణపతిని పూజించండి.

కర్కాటకం :  కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు..శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.ఊహించని రీతిలో∙కాంట్రాక్టులు పొందుతారు.మిత్రుల నుంచి సహాయం అందుతుంది.కాంట్రాక్టులు తుది క్షణంలో దక్కించుకుంటారు.ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమిస్తారు.పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు.... గులాబీ, తెలుపు.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం :  ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు వ్యవహారాలలో విజయం.ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....బంగారు, ఆకుపచ్చ.

పరిహారాలు : దుర్గాదేవిని పూజించాలి.

కన్య : కుటుంబ సమస్యలు వేధిస్తాయి.ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ప్రత్యర్థులతో మరింత జాగ్రత్త అవసరం..ఆరోగ్యసమస్యలు తప్పవు.ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.వ్యాపారాలలో చిక్కులు ఎదురవుతాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు.మహిళలకు కుటుంబపరంగా చికాకులు.అదృష్ట రంగులు....కాఫీ, బంగారు.

పరిహారాలు : నరసింహ స్తో త్రాలు పఠించండి

తుల :  కుటుంబ సభ్యులతో విభేదాలు.రుణాలు చేయాల్సివస్తుంది.శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశంలేదు.దూర ప్రయాణాలు ఉంటాయి.రియల్‌ ఎస్టేట్‌ల వారు నిదానంగా ముందుకు సాగడం మంచిది.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే.విద్యార్థులకు పరిశోధనలు ముందుకు సాగవు.మహిళలకు నిరాశాజనకమే.అదృష్ట రంగులు.... నీలం, పసుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం :  నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల నుంచి కీలక సమాచారం.శుభకార్యాలలో పాల్గొంటారు.పాత బాకీలు వసూలవుతాయి.ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వ్యాపార లావాదేవీలలో పురోగతి.పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.మహిళలకు ఆస్తి లాభాలు.అదృష్ట రంగులు.... గోధుమ, ఆకుపచ్చ.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

ధనుస్సు :  కొత్తగా రుణాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.మిత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.సోదరులను కలుసుకుని ముఖ్యవిషయాలు చర్చిస్తారు.శారీరక  రుగ్మతలు.ఉద్యోగులకు బదిలీలు జరుగవచ్చు.ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారవచ్చు..షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....ఎరుపు, పసుపు.

పరిహారాలు : శివాలయంలో అభిషేకం చేయించుకోండి.

మకరం : ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాల పై చర్చలు జరుపుతారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి.ముఖ్య వ్యవహారాలలో విజయం. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.ప్రయాణాలు సజావుగా సాగుతాయి.కొత్త వ్యక్తుల పరిచయం.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాల్లో ఒత్తిడుల నుంచి విముక్తి.విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు.మహిళలకు ఆస్తిలాభం.అదృష్ట రంగులు....గులాబీ, ఆకుపచ్చ.

పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం : వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.ఆదాయానికి మించి ఖర్చులు.కుటుంబ సభ్యులతో విభేదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి.రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సవాలుగా మారే సూచనలు.ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థులు మరింత శ్రమ పడాలి.మహిళలకు కుటుంబంలో చికాకులు.అదృష్ట రంగులు.... గులాబీ, లేత ఎరుపు.

పరిహారాలు :  శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

మీనం : పనుల్లో అనుకూలత.ఇంటిలో శుభకార్యాలు జరిపిస్తారు.సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు.ఉద్యోగప్రయత్నాలు ఫలించే సమయం.రియల్‌ఎస్టేట్‌ల వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.ఉద్యోగాల్లో ఉన్నత స్థితి అందుతుంది.వ్యాపారులకు లాభాలు తథ్యం.పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు.విద్యార్థులకు ప్రయత్నాలలో విజయం.మహిళలకు శుభవర్తమానాలు.అదృష్ట రంగులు....ఎరుపు, కాఫీ.

పరిహారాలు :  నృసింహ స్తోత్రాలు పఠించండి

 

 

 

 

 

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.