(Local) Fri, 22 Oct, 2021

ఆగష్టు 8,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు

August 08, 2019,   11:47 AM IST
Share on:
ఆగష్టు 8,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు

మేషం : ఆర్థిక లావాదేవీలు కొంత మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. రియల్‌ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహం. వ్యాపారులకు  మరింత లాభాలు. అదృష్ట రంగులు.... కాఫీ,తెలుపు.

పరిహారాలు : శివాష్టకం పఠించండి.

వృషభం : కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని  బాకీలు సకాలంలో అందుతాయి. రియల్‌ఎస్టేట్‌ల వారికి కోర్టు కేసుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే ఛాన్స్‌. మహిళలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అదృష్ట రంగులు.... ఎరుపు, గులాబీ.

పరిహారాలు :  గణేశాష్టకం పఠించండి.

మిథునం : ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కుటుంబ సభ్యులు, ఆప్తులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రియల్‌ఎస్టేట్‌ల వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చు. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు. అదృష్ట రంగులు.... ఎరుపు, పసుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం : కుటుంబ సమస్యలు వేధిస్తాయి. రాబడి అంతగా కనిపించదు. శారీరక రుగ్మతలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు. ఐటీ నిపుణుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, పసుపు.

పరిహారాలు : గణపతిని పూజించండి.

సింహం : పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. శత్రువుల పై విజయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు  ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీయానం. మహిళలకు నూతనోత్సాహం. అదృష్ట రంగులు.... ఆకుపచ్చ. ఎరుపు.

పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య :  బంధువర్గంతో విరోధాలు. ఆర్థిక పరిస్థితి కొంత అసంతృప్తి కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లు మరింత శ్రమించాలి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు.. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. అదృష్ట రంగులు.... గోధుమ, తెలుపు.

పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల : పరిస్థితులు అనుకూలించి ముందుకుసాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. అదృష్ట రంగులు.... ఎరుపు, పసుపు.

పరిహారాలు : లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం :  పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. భూ వివాదాలు నెలకొంటాయి. ప్రయాణాలలో మార్పులు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి  ఇబ్బందిపడతారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సమస్యలు. విద్యార్థుల ఫలితాలపై గందరగోళం. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. అదృష్ట రంగులు.... కాఫీ, బంగారు.

పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.

ధనుస్సు : పనులు సకాలంలో  పూర్తి కాగలవు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. మిత్రులను కలుసుకుని కుటుంబ విషయాలు చర్చిస్తారు. తీర్థ యాత్రలు చేస్తారు. విద్యార్థుల పరిశోధనల్లో గుర్తింపు. అదృష్ట రంగులు.... కాఫీ,గులాబీ.

పరిహారాలు : శివ స్తోత్రాలు పఠించండి.

మకరం :  దూరప్రాంతాల నుంచి శుభ వార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి. ఐటీ నిపుణులు శుభవార్తలు వింటారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం. అదృష్ట రంగులు.... గోధుమ, పసుపు.

పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం : కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. నిరుద్యోగులకు నిరుత్సాహం. రాబడి తగ్గి రుణాలు చేస్తారు. రియల్‌ఎస్టేట్‌ల వారు ఒప్పందాలలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఇబ్బందులు. విద్యార్థుల  కృషి ఫలించదు. మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది. అనారోగ్యం. అదృష్ట రంగులు.... నీలం, ఆకుపచ్చ.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం : కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్య సమస్యలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. విద్యార్థులు శ్రమ తప్ప ఫలితం పొందలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. అదృష్ట రంగులు.... తెలుపు, లేత ఆకుపచ్చ.

పరిహారాలు : హనుమాన్‌ చాలీసా పఠించండి.

సంబంధిత వర్గం
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.