(Local) Tue, 21 Sep, 2021

ఆగష్టు 1,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు

July 31, 2019,   11:51 PM IST
Share on:
ఆగష్టు 1,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు

మేష రాశి : ఈరోజు మొండి బకాయిలు వసూలవుతాయి. కుటుంబం అంతటికి సంతోష భరిత క్షణాలను చేస్తుంది. జాగ్రత్తగా మసలుకోవాలి. మీకు ఎదురైన ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా మాట్లాడండి. 
పరిహారాలు: రెడ్ కలర్ మెరూన్ కలర్ దుస్తులను ధరించండి.

వృషభ రాశి : అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. సంతోషం నిండిన ఒక మంచి రోజు.
పరిహారాలు: మంచి ఆరోగ్యం కోసం ఒక వెండి కడియాన్ని లేదా వెండి ఉంగరాన్ని ధరించండి. 

మిధున రాశి : ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. విశాల దృక్పథం అలవాటు చేసుకోండి. కుటుంబ సభ్యులతో రిలాక్స్ గా మాట్లాడండి. ఆఫీసులో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని మీకు తెలుస్తుంది కాస్త రిలాక్స్ కోసం ప్రయత్నించండి.
పరిహారాలు : నలుపు తెలుపు దుస్తులను ధరించండి దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి  మంచి ఫలితాలను ఇస్తుంది. 

కర్కాటక రాశి : ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేకూరుతుంది. మత సంబంధమైన నా దేవాలయాలకు లేదా ప్రదేశాలకు వెళ్తారు దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ప్రేమ అ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. యాత్రలు ప్రయాణాలు అహ్లాదాన్ని జ్ఞానాన్ని కలిగిస్తాయి . మీ అందమైన వైవాహిక జీవితం ఆనందాన్ని ఇస్తుంది.
పరిహారాలు : అమ్మవారి  దేవాలయంలో ప్రదిక్షణాలు దీపారాధన మంచి ఫలితాన్నిస్తాయి. 

సింహరాశి : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. బంధువులు మీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్టివ్‌గా ఉంటారు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం. 
పరిహారాలు : ఆర్థిక అభివృద్ధి కోసం వేంకటేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ అష్టోతర పూజ చేసుకోండి.

కన్యారాశి : ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. పనిచేసే చోట మీ తెలివితేటలను, లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి.
పరిహారాలు: కుటుంబానికి ఆనందం కోసం చాక్లెట్లు, పాల మిఠాయిలు, చిన్న పిల్లలకు పంపిణీ చేయండి. 

తులారాశి : స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీకుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ రోజు చేసిన మదుపు, బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది, కానీ భాగస్వాములనుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. 
పరిహారాలు: మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి

వృశ్చికరాశి : మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగు పరుస్తుంది. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి లబ్దిని చేకురుస్తాయి. 
పరిహారాలు: విజయాల కోసం ఈ రోజు నవగ్రహాలల్లో గురుగ్రహాన్ని పూజించండి.

ధనస్సురాశి : ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది.
పరిహారాలు: నవగ్రహ స్తోత్రాలను 11 సార్లు రోజు ఉదయం చెప్పండి, శాంతియుతమైన. ఆనందకరమైన కుటుంబ జీవితం లభిస్తుంది.

మకరరాశి : రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. ప్రేమ విషయంలో బానిసలాగ ఉండకండి. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్‌గా వింటారు. మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు మ ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు.
పరిహారాలు: మీ కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడం కోసం పేదలకు సహాయం చేయడం, దేవాలయ దర్శనం చేయండి

కుంభరాశి : నిర్లిప్తతకు, నిస్పృహకు లోనుకాకండి. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. ఈ రోజు,మీరు ఒక క్రొత్త ఎగ్జైట్ మెంట్ తోను, నమ్మకంతోను ముందుకెళ్తారు. మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు.
పరిహారాలు : మంచి జీవితం కోసం ఈరోజు నవగ్రహాల వద్ద శనగలు, పసుపు రంగు పూలను ఉంచి ప్రదక్షిణలు చేయండి.

మీనరాశి : ఈ రోజు ఆశా మోహితులై ఉంటారు మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చును. కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి.
పరిహారాలు: స్థిరమైన ఆర్ధిక పరిస్థితులకు దుర్గా (సింహావాహిని, ఒక సింహం మీద స్వారీ చేస్తున్న) చిత్రపఠాన్ని / విగ్రహాన్ని పూజిస్తారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.