(Local) Mon, 26 Aug, 2019

నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత ...

August 13, 2019,   11:58 AM IST
Share on:

నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. జనార్ధన కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను అధికారులు కూల్చివేశారు.  ప్రభుత్వ స్థలంలో ఇండ్ల నిర్మాణం చేశారని అందుకే ఇండ్లు కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నామని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న నెల్లూరు టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహా పలువురు అక్కడకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

సంబంధిత వర్గం

ఏపీ టీడీపీ నేతపై సీబీఐ విచారణకు హై కోర్ట్ అనుమతి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.