(Local) Mon, 20 Jan, 2020

నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం

November 29, 2019,   12:24 PM IST
Share on:
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీలో ఛైర్మన్ గా సీఎం, మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్ప శ్రీవాణి, ఆళ్లనాని, నారాయణ స్వామి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేశ్, శ్రీ రంగనాథరాజ్, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్‌ మంత్రుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. నవరత్నాలను సమర్థవంతగా అమలు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.