(Local) Mon, 26 Aug, 2019

జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతంగా బక్రీద్‌ ప్రత్యేక ప్రార్థనలు

August 12, 2019,   3:00 PM IST
Share on:

జమ్ముకశ్మీర్‌లో బక్రీద్‌ ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ముస్లింలు ఉదయమే మసీదులకు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. నిషేదాజ్ఞల దృష్ట్యా మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గుంపులుగా రాకుండా బారికేడ్లు పెట్టి పోలీసులు ప్రజల్ని నియంత్రించారు. నిషేదాజ్ఞల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి భారీ ప్రదర్శనలు నిర్వహించడానికి పోలీసులు అనుమతించలేదు.

బక్రీద్‌ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రేషన్‌ దుకాణాల్లో సరకులు అందుబాటులో ఉంచారు. ఏటీఎంలలో డబ్బులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. శ్రీనగర్‌లో ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులకు పోలీసులు, అధికారులు మసీదుల వద్ద శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

సంబంధిత వర్గం

కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.