(Local) Mon, 17 Jun, 2019

కోడెల ఫ్యామిలీ చట్టం నుండి తప్పించుకోలేదు'-ట్విటర్‌లో విజయసాయి రెడ్డి

June 09, 2019,   1:55 PM IST
Share on:

ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.ఆదివారం ఆయన ట్విటర్‌ వేదికగా కోడెల అరాచకాలపై ధ్వజమెత్తారు. కోడెల కుటుంబం ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులేనని, నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు.బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.

 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.