(Local) Tue, 20 Oct, 2020

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

November 28, 2019,   9:58 AM IST
Share on:
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 3గంటల పాలు కొనసాగిన సమావేశంలో కాపు మహిళలకు ఆర్థిక సాయం అందించే కాపు నేస్తం పథకానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద కాపు మహిళలకు ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి పచ్చజెండా ఊపారు.
రాష్ట్రంలో రేషన్ కార్డులను పొందేందుకు నిబంధనల్లో మార్పులు చేసే అంశంపైనా చర్చించారు. ఆదాయం, భూమి, విద్యుత్ వినియోగం నిబంధనల్లో మార్పులకు కేబినెట్ ఓకే చెప్పింది. విద్యుత్ వినియోగం, భూమి, ఆదాయంంలో మార్పులకు అంగీకారం తెలిపారు. అసైన్డ్ భూములు, పేదలకు ఇచ్చే భూములపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం చేయనున్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేతకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.
నవశకం పథకం ద్వారా ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.
కడప ఉక్కు పరిశ్రమకు ముడి సరుకు కోసం ఎన్ఎండీసీతో ఒప్పందానికి నిర్ణయం
జగనన్న వసతి దీవెన కింద రూ.2300 కోట్లు. జగనన్న విద్యా దీవెన కింద రూ.3400 కోట్లు
కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంపై కేబినెట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.