(Local) Mon, 22 Jul, 2019

ఐటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుగుముఖం పడుతున్నాయి - లోకేష్

July 03, 2019,   11:46 PM IST
Share on:

ఐటీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని టి డిపి నేత లోకేశ్‌ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో ఆయన సమావేశమయ్యారు. గతంలో కొత్త ప్రభుత్వాలకు ఆరు నెలల సమయమిచ్చే సంప్రదాయం ఉందని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, ప్రజల ఇబ్బంది చూస్తుంటే అంత సమయం సరికాదనే భావన కలుగుతోందని లోకేశ్‌ అన్నారు. కేవలం నెలరోజుల్లో ఆరుగురు టి డిపి కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నవరత్నాలను మాత్రమే అమలు చేస్తామంటున్నారని, పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల సంగతేంటని లోకేశ్‌ ప్రశ్నించారు. మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన.. మంగళగిరిలో ఓటమికి గల కారణాలు పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.