(Local) Wed, 12 Aug, 2020

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

November 28, 2019,   3:55 PM IST
Share on:
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

ఏపీ సర్కార్ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేసేందుకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సంబంధిత అంశాలపై మంత్రుల బృందం(జీఓఎం)కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారుల బృందం ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అటవీ,పర్యావరణ, ఆరోగ్య, పంచాయితీరాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శలతో కూడిన అధికారుల బృందం సలహాలు సూచనలు ఇవ్వనుంది. అధికారుల బృందానికి కన్వీనర్‌గా ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరించనున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై 30 జూన్‌ 2020లోగా మంత్రుల బృందానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.