(Local) Mon, 20 Jan, 2020

సెప్టెంబర్ 1లోపు ఏపీ ఉద్యోగులకు శుభవార్త

August 28, 2019,   12:10 PM IST
Share on:
సెప్టెంబర్ 1లోపు  ఏపీ ఉద్యోగులకు శుభవార్త

ఏపీ ఉద్యోగులకు సెప్టెంబర్ 1 లోపు శుభవార్త అందిస్తామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ మంత్రి బుగ్గనకు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. అయితే దీని పై మంత్రి సానుకూలంగా స్పందించి మీరంతా కోరుకున్నట్టే శుభవార్త వింటారని, సెప్టెంబర్ 1 లోపే ఈ శుభవార్తను సీఎం జగన్ ఉద్యోగులకు అందిస్తారని అన్నారు. దీని పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సెప్టెంబర్ 1న నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

సంబంధిత వర్గం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.