(Local) Wed, 21 Aug, 2019

విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదం

August 12, 2019,   3:43 PM IST
Share on:

విశాఖ ఔటర్ హార్బర్ లోని టగ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నౌకలో సివిల్ పనుల కోసం సిబ్బందిని తరలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ప్రమాదంలో 70శాతం వరకు ఆ టగ్ తగలబడింది. ప్రమాదంలో 70శాతం వరకు ఆ టగ్ తగలబడింది. భయాందోళనకు గురైన సిబ్బంది అంతా సముద్రంలో దూకారు. వారి కేకలు విన్న కోస్ట్ గార్డు సిబ్బంది బయటకు తీశారు. సముద్రంలో దూకిన 29 మందిలో 28 మందిని రక్షించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 70శాతం వరకు గాయాలు కావడంంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చమురు నౌకలను బెర్త్ దగ్గరకు తీసుకురావడం, నౌకలో సిబ్బంది సేవల కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ పీసీఎల్ ఈ టగ్ ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.