(Local) Mon, 16 Sep, 2019

సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళంలో సన్న బియ్యం పంపిణీ

August 28, 2019,   2:08 PM IST
Views: 61
Share on:
సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళంలో సన్న బియ్యం పంపిణీ

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రైతుల నుంచి స్వర్ణరకం బియ్యాన్ని సేకరిస్తామన్నారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన బియ్యంలో 25 శాతం నూకలే ఉండేవన్నారు. ఆహారం అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం కాబట్టి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. అందులో భాగంగా ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నామన్నారు. ఆ తర్వాత దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

సంబంధిత వర్గం
పలాస  కిడ్నీ సూపర్‌ స్పెషాల్లీ ఆసుపత్రిని ప్రారంభి ...
పలాస కిడ్నీ సూపర్‌ స్పెషాల్లీ ఆసుపత్రిని ప్రారంభి ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.