(Local) Wed, 26 Feb, 2020

25 మందితో టిటిడి పాలక మండలి

August 29, 2019,   12:50 PM IST
Share on:
25 మందితో టిటిడి పాలక మండలి

టీటీడీ పాలక మండలి ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది.  సీఎం జగన్ తో,టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాలకమండలి కూర్పు పై చర్చించారు. టీటీడీ పాలకమండలి సభ్యులను 25 మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 19 మంది సభ్యులు ఉండేవారు. ఆరుగురు సభ్యులను ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాలకమండలిలో సభ్యులుగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కోటాలో భూమన కరుణాకర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావులకు చోటు ఖాయమైందని తెలుస్తోంది. మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డికి అవకాశం దక్కిందని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

సంబంధిత వర్గం
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ ...
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.