(Local) Fri, 30 Oct, 2020

రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు

November 28, 2019,   2:15 PM IST
Share on:
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు

ఏపి రాజధాని అమరావతి పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నా ఆగకుండా పర్యటన కొనసాగించడంతో ఉద్దండ రాయుని పాలెంలో ఆయనకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అంతే కాకుండా మహిళలు పూల వర్షం కురిపించారు. వైసీపీ కార్యకర్తలు సీడ్ యాక్సిస్ రహదారి పై వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు విసిరారు. దాంతో తెలుగుదేశం శ్రేణులు ప్రతి దాడికి దిగాయి.

ఒక వైపు రైతులు చంద్రబాబు కు స్వాగతం పలుకగా పలువురు ఆందోళనకారులు నల్ల జెండాలతో  నిరసన తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకుని పోలీసులు చంద్రబాబు పర్యటనకు మార్గం సుగమం చేశారు. ఆందోళనకారులు  ముందుగా చేరుకున్నా పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.

ఉద్దండరాయుడిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానించడం కాకపోతే, రాజధాని నిర్మాణం ఆపడం ఏంటి అని ఆయన అన్నారు. అనంతరం వారందరితో కలిసి ప్రధాని మోడి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లిన చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం నిలుపుదలకు వైఎస్‌ఆర్‌సిపి దురుద్దేశం తప్ప, ఇక్కడి పనులు ఆపేందుకు కారణాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని కుట్రపూరితంగానే వైఎస్‌ఆర్‌సిపి సర్కార్‌ నిలిపివేసిందని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపి కుట్రలను చాటిచెప్పేందుకే అమరావతిలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.