(Local) Wed, 24 Jul, 2019

ఆర్టికల్ 62 జీవో గుట్టు ఏంటో చెప్పాలి - నారా లోకేష్

July 04, 2019,   11:39 AM IST
Share on:

ఏపీ పోర్టుల వ్యవహారంలో 2019 జూన్ 28న జారీ అయిన ఆర్టీ-62 జీవో గుట్టు ఏంటో చెప్పాలని మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ముందు రహస్య జీవో అని చెప్పి రెండు రోజుల్లో జారీ చేయబడలేదని మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. బందరు పోర్టుపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయని చెప్పారు. ఈ జీవో విషయంపై జగన్‌ స్పష్టత ఇవ్వాలని లోకేశ్ సూచించారు. సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరని, బందురు పోర్టుపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీలేదని లోకేశ్ అన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.