
పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం) చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబుకు కుడి, ఎడమ కాలువల పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లో సభ్యునిగా కూడా సుధాకర్‌బాబును నియమించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్–ఇన్–చీఫ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఇంజనీర్–ఇన్–చీఫ్ ఎం.వెంకటేశ్వరరావును అదనపు బాధ్యతల నుంచి తప్పించారు.
కాగా, పోలవరం.. నీటిపారుదల విభాగం ఈఎన్సీ పదవులను ఒక్కరే నిర్వహిస్తుండటంవల్ల పనిభారం పెరిగి ప్రాజెక్టు పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఇంజనీర్–ఇన్–చీఫ్‌ను నియమించాలంటూ జూలై 11, 2017న కేంద్ర జలవనరుల శాఖ అప్పటి కార్యదర్శి అమర్జీత్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం, పీపీఏ కూడా లేఖలు రాసినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కారానికి, జలవనరుల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు కొత్త ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీచేసింది. పోలవరం పనుల పర్యవేక్షణ, పీపీఏతో సమన్వయం, కేంద్ర జలవనరుల శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో పోలవరం ఈఎన్సీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావును వాటి నుంచి తప్పించింది. పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను ప్రస్తుతం హెడ్ వర్క్స్‌ను పర్యవేక్షిస్తున్న సీఈ సుధాకర్‌బాబుకే పూర్తిగా అప్పగించింది. దీంతో నీటిపారుదల విభాగం ఈఎన్సీకి అదనపు భారం లేకపోవడంవల్ల ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్
26 Nov 2019, 11:05 AM
-
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
26 Nov 2019, 10:23 AM
-
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
25 Nov 2019, 2:53 PM
-
జగన్‌పై నెగ్గిన చంద్రబాబు పంతం..?
24 Nov 2019, 11:34 AM
-
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
21 Nov 2019, 6:53 PM
-
ఇంగ్లీష్ మీడియంతో ప్రజలు అటూ ఇటూ కాకుండా పోతారు: స ...
21 Nov 2019, 5:40 PM
-
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్
18 Nov 2019, 7:13 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
29 Nov 2019, 3:49 PM
-
బ్రేకింగ్ : మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి..
29 Nov 2019, 2:38 PM
-
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
29 Nov 2019, 2:25 PM
-
చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరిన వారిని అరెస్ట ...
29 Nov 2019, 12:45 PM
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
29 Nov 2019, 12:30 PM
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
29 Nov 2019, 12:24 PM
-
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం: జగన్
28 Nov 2019, 4:15 PM
-
సంక్షేమ పథకాలు రాష్ట్రానికి భారం కాదు: మంత్రి బుగ్ ...
28 Nov 2019, 4:04 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
28 Nov 2019, 2:15 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
28 Nov 2019, 9:58 AM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM

రాజధాని రైతుల్లో ఆనందం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.