(Local) Mon, 20 Jan, 2020

మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం

November 28, 2019,   8:56 AM IST
Share on:
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం

ఏపీలో మద్యపాన నిషేధం పై సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం వినియోగదారులకు రిటైల్ షాపుల ద్వారా అందించే మద్యం బాటిళ్ల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్ అన్నారు. వినియోగదారులకు రిటైల్ షాపుల నుంచి ఒక్క బాటిల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు సవరించాలన్న సీఎం జగన్ మంత్రులకు సూచించారు. మద్యాన్ని విపరీతంగా కంట్రోల్ చేయడం వల్ల టూరిజం దెబ్బతినే అవకాశం ఉందని  మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దీంతో సీఎం జగన్ టూరిజం కోసం కాదు.. సమాజం కోసం ఆలోచించాలన్నారు. కుటుంబాలతో వెళ్లేవారు మద్యాన్ని తాగరని సీఎం గుర్తు చేశారు. 

మద్యం ధరలు మరీ ఎక్కువవుతున్నాయని పలువురు మంత్రులు అనడంతో ఏం పర్వాలేదు... తాగేవారు తక్కువ అవుతారని జగన్ అన్నారు. అవసరమైతే ధరలు మరింత పెంచాలన్నారు. మద్యపానాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటూ మహిళా మంత్రులను సీఎం జగన్ ప్రశ్నించారు. దీంతో వారు చేయాలని అన్నారు. సీఎం జగన్ మద్యపాన నిషేధం పై చాలా కఠినంగా ఉండడంతో పలువురు మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.