(Local) Wed, 21 Aug, 2019

సన్న బియ్యం పంపిణీకి అధికారుల కసరత్తు

August 13, 2019,   12:32 PM IST
Share on:

ప్రజాపంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం సేకరణపై దృష్టి సారించింది. బియ్యం సేకరణ తీరుపై పదేపదే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక నుండి రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సన్నబియ్యం తగినంతగా అందుబాటులో లేని కారణంగా వచ్చే మార్చి నుండి అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.

ఇదే సమయంలో ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం స్థానంలో మరింత నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు రేషన్ షాపుల నుండి సేకరించే బియ్యంలో 25 శాతంగా ఉండే నూకలను, 15శాతం మాత్రమే ఉండేలా విధి విధానాలను తయారు చేసింది. అలాగే జిల్లా వ్యాప్తంగా పంపిణీ కోసం అవసరమైన మొత్తం బియ్యాన్ని వీలైనంత త్వరగా సేకరించాలని ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రస్తుతం 15 శాతం మాత్రమే ఉండే బియ్యాన్ని సేకరించేందుకు అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించారు

సంబంధిత వర్గం

మద్యం దుకాణాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తుల ...
మోడికి లేఖ రాసిన కాపు ఉద్యమ నేత

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.