(Local) Fri, 22 Nov, 2019

కొలువుదీరేప్పుడు ...?

January 10, 2019,   2:04 PM IST
Share on:
కొలువుదీరేప్పుడు ...?


సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఎక్కువ మెజార్టీ వచ్చిన పార్టీని ఆ రాష్ట్ర గవర్నర్
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆనవాయితీ. అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు అసెంబ్లీని ఏర్పాటు పరచి తద్వారా
ఆయా ఎమ్మెల్యేలు తమ శాసన సభ పక్ష నాయకున్ని ఎన్నుకుంటారు. అతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
చేయడం జరుగుతుంది. అనతరం అతనికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్ని గవర్నర్కి
అందజేయడం జరుగుతుంది. అప్పుడు వారిని ప్రభుత్వం ఏర్పాటుకు వారం నుండి రెండు వారల గడువులో తమ బల
నిరూపణ చేసుకోవల్సివుంటుంది. అలా బల నిరూపణ అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో నూతన మంత్రి వర్గం
ఏర్పాటు కావల్సి వుంటుంది. ముఖ్యమంత్రి తన కోటరీని ఏర్పాటు చేసుకునేందుకు మహా అయితే నాలుగైదు రోజుల్లో
నూతన ప్రభుత్వం కొలువుదీరుతుంది.


ఆలస్యంతో అభివృధ్ధికి ఆటంకం...!
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో
ఎన్నికలు జరిగాయి. అందులో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రేస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగా
తెలంగాణలో అధికార పార్టీ భారీ మెజార్టీతో తిరిగి అధికారాన్ని చేజిక్కించున్న సంగతి తెలిసిందే. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి
వచ్చిన ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరనేది రెండు మూడు రోజులు ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం
నెలకొంది. కాని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాధీ పలువురు నేతలతో సమావేశమై అందరికీ ఆమోదయోగ్యమైన
అభ్యర్థులను ప్రకటించారు. అలా ప్రకటించడమే తరువాయి వారు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకార కార్యక్రమం చకచకా
జరిగిపోయింది.


అన్నితానై...
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్ఠీ అధికాన్ని చేజిక్కించుకుని దాదాపు నెల రోజులు కావ‌స్తుంది.
కాని ఇంత‌వ‌ర‌కు కేబినెట్ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో రాష్ట్రంలోని ప‌లు శాఖ‌ల‌కు సంభందించిన ఫైళ్ళు ఆ శాఖమాత్యుల
కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని శాఖ‌ల‌ను సీఎం కేసీఆర్ త‌న చేతుల్లో పెట్టు కున్నారు. ఇప్ప‌టికే భారీ
నీటి పారుద‌లకు సంబందించి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను త‌నే స్వ‌యంగా ప‌రిశీలించి ఆయా అధికారుల‌తో స‌మీక్ష
స‌మావేశాలు నిర్వ‌హించారు. అలాగా మిష‌న్ బ‌గీర‌థ ప‌నుల‌ను మార్చి 31లోగా ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు
ఆదేశాలు జారీ చేశారు. ఇలా కొన్ని ప‌నుల్లో వేగం పెంచినా ఒక్క సీఎం మాత్ర‌మే అన్ని శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం వీలు

కాదు. అలాగే ఇటు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్ర‌జా ప్ర‌థినిధులు సైతం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు జ‌రుగుతుందోన‌ని
ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్న నాయ‌కులు మాత్రం త‌మ నియోజ‌క వ‌ర్గ అభివృధ్ది ప‌నుల‌ను గాలికి
వ‌దిలేసి రాష్ట్ర రాజ‌ధానిలో మ‌కాం వేసి త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో ఇటు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌జిడెంట్ కేటీఆర్ ద్వారా అటు
కేసీఆర్ కూతురు క‌వితల‌ని ప్ర‌స‌న్నం చేసుకుని కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించాలంటూ వారి చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు
చేయ‌డ‌మే స‌రిపోతుంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఇంకెన్నాళ్ళకి జ‌రుగుతుందోన‌ని ఈ ఆల‌స్యానికి కార‌ణాలు ఏమిట‌నే ప్ర‌శ్న‌లు
సైతం త‌లెత్తున్నాయి.


ముహూర్తాల‌కే పెద్ద‌పీఠ‌...!
దైవ భ‌క్తి, జాత‌కాల‌పై ఎక్కువ న‌మ్మ‌కున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు అందులో ప్ర‌తి ప‌నిని
ముహూర్తం చూసుకుని మొద‌లు పెడ‌తారనే నానుడి. అందుకు త‌గ్గ‌ట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో మ‌రో ఎనిమిది నెల‌ల
స‌మ‌యం ఉండ‌గానే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్ళారు. అనుకున్న‌ట్టే తిరిగి అధికారంలోకి వ‌చ్చారు. ఇక
మంచి ముహుర్తం చూసుకుని సీఎంగా ప్ర‌మాణ సీకారం కూడా చేశారు. త‌న కోట‌రీని సైతం ఏర్పాటు చేసుకుంనేందుకు
మంచి ముహూర్తం కోసం ఎదురు చూసిన ఆయ‌న జ‌న‌వ‌రి 17న ఉంద‌న‌డంతో ఇక త‌న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణను అప్ప‌టి
వ‌ర‌కు వాయిదా వేశార‌ని విస్వ‌స‌నీయ స‌మాచారం. ఏదిఏమైనా దైవ బ‌లం ఎంతున్నా ఒక మాన‌వునిగా త‌న ప్ర‌య‌త్నం
కూడా వుండాల‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.