(Local) Wed, 26 Feb, 2020

గోడ దూకే వేళాయేరా...!

February 20, 2019,   2:22 PM IST
Share on:
గోడ దూకే వేళాయేరా...!

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ నాయ‌ల‌కుల త‌మ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ ఎక్క‌డ ఉంటే సేఫ్ జోన్‌లో వుంటామ‌ని త‌మ అనుచ‌ర‌గ‌ణంతో చ‌ర్చించ‌డం వారితోపాటు ఆయా ప్రార్టీలో త‌మ‌కు ఇచ్చే ప్రాధాణ్య‌త‌ల‌ను బేరీజు వేసుకుంటూ అందుక‌నుగుణంగా ఒక పార్టీ నుండి మ‌రోక పార్టీలోకి గోడ దూకేందుకు స‌న్న‌ద్దం అవుతుంటారు. అయితే ఇప్పుడు తాను ఉంటున్న పార్టీ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తుందా లేదా అంటూ అంచ‌నాలు వేసుకుంటుంటారు. ఆ పార్టీ గెల‌వ‌దని తెలిసిన మ‌రుక్ష‌ణం గెలవ‌బోతున్నప‌క్క పార్టీల వైపు ఆ నాయ‌కుల చూపు ప‌డుతుంది. గ‌తం లో వారికున్న ప‌రిచ‌యాల‌తో ఆయా పార్టీల అధినాయ‌కుల‌తో మంత‌నాలు జ‌రప‌డం పార్టీ కండువా క‌ప్పుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రుగుతుంన్న‌ది అదే. 
సంక‌టంగా మూరుతున్న నాయ‌కుల తీరు :
ఇంత‌కాల ఒక పార్టీ జెంఢా మోసి తీర ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి చొక్కాలు మార్చినంత తేలిగ్గా పార్టీలు మార్చుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రో నాయ‌కున్ని అక్క‌డ త‌యారు చేసుకోవల్సిన ప‌రిస్థితి. స‌హ‌జంగా అప్ప‌టి వ‌ర‌కు ఆయా పార్టీలో అన్ని ప‌ద‌వుల‌ను అనుభ‌వించి  తీరా ఎన్నిక‌ల వేళ వేరే పార్టీలోకి జంప్ చేస్తే... ఇలాంటి ప‌రిస్థితుల్లో అధికార ప్ర‌తిప‌క్ష పార్టీ అనే తేడా లేకుండా ఆయా పార్టీల‌కు కొతమేర న‌ష్టం వాటిల్ల‌క త‌ప్ప‌దు. మొద‌టి క్యాడ‌ర్ స్థానంలో తిరిగి రెండ‌వ క్యాడ‌ర్ నాయ‌కుల‌ను తీసుకోవాల్సిన ప‌రిస్థితి.
గెలుపు ఓట‌ములు స‌హ‌జం : 
ఆట‌లో గెలుపు ఓట‌ముల‌నేవి స‌హ‌జం. ఏదో ఒక జ‌ట్టు మాత్రమే క్రీడ‌లో విజేత‌గా నిలుస్తుంది. అంత మాత్రాన ఒడిన జ‌ట్టులో నేనుండ‌నని క్రీడాకారుడు ఆ జ‌ట్టు నుండి మ‌రో జ‌ట్టుకు వెళ్ళ లేడు..  వెళ్ల‌డు కూడా, కాని ఈ ఎన్నిక‌ల క్రీడాలో అలాంటిదేం లేదు. కాని ఒక నాయ‌కుడిని అన్ని విధాలుగా అండ‌దండ‌లు అందించి అత‌డు ఎద‌గ‌డానికి ఆ పార్టీలు ఎంత కృషి చేస్తాయో.. చివ‌రికి త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు, స్వార్ధ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ అధికార దాహ‌మే ల‌క్ష్యంగా పార్టీలు మార్చుతున్నారు. కాని అక్క‌డ అంత‌కు ముందునుండి పార్టీ విధేయులుగా క‌ష్టప‌డి ప‌నిచేస్తున్న వారి భ‌విష్య‌త్‌కి గండి కొడుతున్నారు. అధికారంలో ఉండ‌గా అన్నీ అనుభ‌వించి చివ‌రికి ప్ర‌తిప‌క్షంలోకి రాగానే నియోజ‌క వ‌ర్గ అభివృద్ధి పేరుతో పార్టీలు మార‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టనేది ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది. గ‌తంలోనూ అలాంటి సంఘ‌ట‌న‌లే జ‌రిగాయి. 
నాయ‌కుల్లో విశ్వ‌సనీయ‌త ఎంత‌..?
నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న పార్టీ అధ్య‌క్షుడు గొప్ప నాయ‌కుడ‌ని వారి మ‌న్న‌లు పొందాల‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై దుమ్మెత్తి పోసిన సంధ‌ర్భాలు చూసాం. కాని త‌మ స్వార్ధ రాజ‌కీల‌తో అంద‌లం ఎక్కేందుకు  ఏపార్టీలో భ‌విష్య‌త్ వుంటుందో అక్క‌డ తిష్ట వేసేందుకు గ‌తాన్ని మ‌ర‌చి తిరిగి అదే నాయ‌కుడు గొప్ప‌వాడ‌ని పొగుడుతూ... ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తారా...? అదిస‌రే అక్క‌డ ఇంత‌కాలం పార్టీకి సేవ చేసిన నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి..? వ‌రి అభివృధ్దికి ఆటంకం క‌లింగించ‌డం ఎంతవ‌ర‌కూ స‌మంజసం కాదు. ఇటీవ‌లే అధికార పార్టీ నుండి ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరేందుకు ఓ నేత ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డంతో ఇక పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి వెన్నంటి వున్న మా ప‌రిస్థితి ఏంట‌ని స‌ద‌రు నేత హుటాహుటీనా హైద‌రాబాద్ చేరుకుని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో చ‌ర్చించి త‌మ అస‌హ‌నాన్ని వెళ్ల‌బుచ్చ‌డం గ‌మ‌నార్హం. ఏది ఏమైనా ఎన్నిక‌ల వేళ నాయ‌కులు గోడ దూకే కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేశారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.