(Local) Thu, 21 Nov, 2019

స‌మ్మ‌ర్ తో జాగ్ర‌త్త :

February 25, 2019,   1:35 PM IST
Share on:
స‌మ్మ‌ర్ తో జాగ్ర‌త్త :

శీతాకాలం వెళ్లిపోతుంది. ఇక ఎండాకాలం రానే వ‌చ్చింది. ఎండాకాలం అన‌గానే చ‌ల్ల‌ని ఐస్ క్రీంలు, భ‌ర్ఫీ, ష‌ర్బ‌త్‌, ల‌స్సీ, స‌బ్జా గింజ‌ల‌తో చ‌ల్ల‌చ‌ల్ల‌ని నిమ్మ‌ర‌సం ఇలా అన్నీగుర్తుకు వ‌స్తాయి. కాని అదే టైంలో వ‌డ‌గాల్పులు ప్ర‌మాద‌క‌రంగా ఉంటాయి. వీటి బారిన ప‌డి , వ‌డ‌దెబ్బ‌కుగురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారిని ఎంద‌రినో చూసాం. ఈ సారి అంత‌కంటే ఎక్కువ‌గా ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఫిబ్ర‌వ‌రి నెల‌తో వెళ్లిపోతున్న శీతాకాలాన్ని వేడి సెగలతో దూసుకొస్తున్న వేసవికాలం వెచ్చగా శీతాకాలాన్ని సాగనంపుతోంది. ఈ నెలాఖరుకల్లా శీతాకాలం సీజన్‌ ముగిసి వేసవి ప్రారంభం కానుంది. ఈ రెండు సీజన్ల (కాలాల) సంధికాలంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా సాధారణంకన్నా 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంకన్నా ఇంత ఎక్కువ ఉన్న ప్రాంతం ఇదేనని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వైకే రెడ్డి ప్రకటించారు. శీతాకాలం నుంచి వేసవిలోకి ప్రవేశించే సమయంలో ఇలాంటి వాతావరణ మార్పులు సహజమేనని చెప్పారు. గత పక్షం రోజుల క్రితంతో పోలిస్తే పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా ఏకంగా 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయని, సీజన్‌ మారే సమయంలో ఏర్పడే ఇలాంటి వాతావరణం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం సాధారణమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు లేదా ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నట్లు వివరించారు. మిగతా ప్రాంతాల్లో ఎండ వేడి పెరగనుంది. ఆదివారం నుంచి 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని చెప్పారు.
త‌ప్ప‌ని స‌రైతేనే త‌గు జాగ్ర‌త్ల‌ల‌తో బ‌య‌ట‌కి వెళ్ళాలి :
ఇప్ప‌టికే వివిధ ప‌ట్ట‌ణాలలో సాధార‌ణ స్థాయికి మించి ఎండ‌లు కాస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు త‌మ దాహ‌ర్తిని తీర్నుచునేంద‌కు ఇప్ప‌టికే శీత‌ల పాణియాల షాపుల‌కు ప‌రుగ‌లు తీస్తున్నారు. న‌గ‌రంలోని ప‌లు శీత‌ల పాణియాల సెంట‌ర్‌లు జ‌నాల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. నిన్న‌(శ‌నివారం) రోజున‌ వివిధ న‌గ‌రాల్లో గ‌త ప‌ది సంవ‌త్స‌రాల క్రితం ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో న‌మోదైన అత్య‌ధిక ఊష్ణోగ్ర‌త‌ల‌ను అధిగ మించి ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. మార్చి ఎప్రిల్ మే నెల‌ల్లో మ‌రింత అధిక ఊష్ణోగ్ర‌త‌లు న‌మోదైయ్యే అవ‌కాశాలున్నాయని వాతావ‌ర‌ణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేస‌వి కాలంలో ప్ర‌జ‌లు సాధ్య‌మైనంత వ‌ర‌కు బ‌య‌ట‌కి వెళ్ళ‌కూడ‌దని డాక్ట‌ర్‌లు స‌ల‌హాలు ఇస్తున్నారు. త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల్లో వెళ్ళాల్సి వ‌స్తే తెల్ల‌ని కాట‌న్ వ‌స్త్రాల‌ను ధ‌రించాల‌ని, అలాగే వ‌డ‌గాల్పుల‌కు గురికాకుండా గొడుగు, ముఖానికి మాస్క్‌లాంటివి ధ‌రించి వెళ్ళ‌ల‌ని సూచిస్తున్నారు.

వివిధ న‌గ‌రాల్లో ఇటీవ‌ల‌ న‌మోదైన ఊష్ణోగ్ర‌త‌లు :

శని ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కర్నూలులో 39.7, నందిగామలో 39.1, భద్రాచలంలో 38.5, మహబూబ్‌నగర్‌లో 38.2, హైదరాబాద్‌లో 36.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకన్నా ఇవి 4 డిగ్రీలదాకా అదనం. చల్లగా ఉండాల్సిన తిరుపతిలో ఏకంగా 38.9 డిగ్రీలుంది. ఇది సాధారణంకన్నా 4.8 డిగ్రీలు ఎక్కువ‌గా న‌మోదైనాయి. నందిగామలో శనివారం 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ గత పదేళ్ల కాలంలోని అత్యధిక ఉష్ణోగ్రత 2009 ఫిబ్రవరి 25న 39 డిగ్రీలుగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు అది చెరిగిపోయి 39.1 డిగ్రీలు నమోదైంది. కర్నూలులోనూ గత పదేళ్ల  అత్యధిక రికార్డు 2009 ఫిబ్రవరిలో 39.9 డిగ్రీలుండగా ఇప్పుడు దానికి చేరువగా 39.7 డిగ్రీలకు చేరింది. ఆదిలాబాద్‌ పట్టణంలో గత పదేళ్ల అత్యధిక రికార్డు 2017 ఫిబ్రవరి 22న 37.8 డిగ్రీలుగా ఉంది. శని ఆదివారాల్లో ఇక్కడ దానికి చేరువగా 37.3 డిగ్రీలు నమోదైంది. ఈ పట్టణంలో నెలరోజుల్లో ఏకంగా 10 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరగడం గమనార్హం.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.