(Local) Fri, 22 Nov, 2019

ఉగ్ర‌వాదుల‌కు అండ‌దండ‌లు

February 18, 2019,   3:18 PM IST
Share on:
ఉగ్ర‌వాదుల‌కు అండ‌దండ‌లు

ప‌క్క‌నున్న పాకిస్తాన్ నుండి భార‌త్‌లో దాడులు నిర్వ‌హించేందుకు ప‌న్నాగం ప‌న్నుతున్న ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు జ‌మ్ము కాశ్మీర్‌లో స్థానికుల అండ‌దండ‌లు పుష్క‌లంగా అందుతున్నాయి. అది ఎంతలా అంటే వారికోసం త‌మ ప్రాణాలు సైతం తృణ‌ప్రాణ‌యంగా అర్పించేంతలా వుంది. భార‌త పౌరులై వుండి పొరుగు దేశానికి  ఇంత‌లా స‌పోర్టు ఇస్తున్నారంటే మన పాల‌కులు వారి పై దీనిపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం వుంది. ప్ర‌మాదం జ‌రిగినప్పుడు చ‌ర్య‌లు తీసుకోవ‌డం స‌మ‌ర్థించ‌ద‌గిన విష‌య‌మే, అయినా ఇక్క‌డ ఎందుకు ఇలాంటి ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. కాశ్మీరీ యువ‌త ఎందుకు ఉగ్ర‌వాదం వైపు చూస్తున్నార‌నే కోణంలో విచారించి అందుకు గ‌ల మూలాల‌ను క‌నుక్కొని శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల్సిన అవ‌సరం  ఎంతైనా వుంది. యువ‌త చెడుమార్గం వైపు దృష్టి  మరలకుండా  నిరుద్యోగ యువతకు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించి వారిని స‌రైన దారిలో పెట్టాల్సిన  అవసరం పై పాల‌కులు ఆలోచించాలి.

అనంత లోకాల్లోకి :‍
జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో ఎటు చూసినా ఎత్తైన మంచు కొండ‌లు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం అలాంటి తెల్ల‌టి కొండ‌లు ఒక్కసారిగా అదిరి ప‌డ్డాయి. అంత వ‌ర‌కు  చ‌ల్లాగా ఉన్న జ‌మ్ము వేడెక్కిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో దేశం ఉలిక్కి ప‌డింది.  సెలవులు ముగించుకొని జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాల వాహనాల‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్ర‌వాదులు దాడికి తెగబడ్డారు. కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేయడంతో దాదాపు 49 మంది జవాన్లు బలయ్యార‌న్న విష‌యం తెలిసిందే. మొత్తం 78 వాహనాల్లో 2500 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్నారు. అవంతిపురా ప్రాంతానికి చేరుకోగానే జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అదిల్‌ అహ్మద్‌ 350 కిలోల ఆర్‌డీఎక్స్‌ పేలుడు పదార్థాలు ఉన్న కారుతో సీఆర్పీఎఫ్‌ వాహనాల్లోని ఒక దానిని ఢీ కొట్టాడు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు త‌మ కుటుంబంతో క‌ల‌సిన వున్న ఆనంద‌క‌ర విష‌యాల‌ను  పంచుకుంటూ మ‌రో అర‌గంట‌లో వారి గ‌మ్మ‌స్థానాల‌కు చేరుకుంటార‌న‌గా వారి ప్రాణాలు అనంత లోకాల్లో  క‌లిసిపోయాయి. 

ప్ర‌పంచ దేశాల సానుబూతి:
పక్క‌నే ఉన్న బ‌ద్ద శత్రువు  పాకిస్తాన్ చేస్తున్న కుట్ర‌లో బాగంగా భార‌త్ లో ఉగ్ర‌వాదుల‌తో నిత్యం దాడులు చేయిస్తూ ప్ర‌జ‌ల‌ను బ‌య‌భ్రాంతులకు  గురిచెయ్యాల‌ని చూస్తుంది. ఈ ఎత్తుగ‌డ‌ల‌ను భార‌త్ బ‌ల‌గాలు గట్టిగానే స‌మాధానాలు ఇస్తున్నాయి. పొరుగు దేశం చేస్తున్న కుట్ర‌ల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేసి పాక్‌ను ఏకాకి చేయ‌డంలో భార‌త్ సఫలమయ్యింది .ఈ ఘటనపై యావత్ ప్రపంచం అయ్యో పాపం అన్నాయి . ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి . అన్ని దేశాలు భార‌త్‌కి బాస‌ట‌గా నిలిచాయి. చైనా మిన‌హా అన్ని అగ్ర రాజ్యాలు భార‌త్ ప‌క్షాన నిలిచాయి.

ముష్క‌రుల ఏరివేత :
దాదాపుగా ఈ 15 సంవ‌త్స‌రాల కాలంలో జమ్ముకశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోది పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో స‌ర్వ అధికారాల‌ను ఆర్మీకి ఇచ్చారు. దేశంలో ఉగ్ర‌వాదుల‌కు తావు లేకుండా చేయ‌డానికి వారిని ఏరి వేయ‌డానికి మీరు ఏ చ‌ర్య‌లైనా తీసుకోండ‌ని తెలిపారు. దీంతో జ‌మ్ములో జ‌వానులు జ‌ల్లెడ ప‌డుతున్నారు.  పుల్వామా ఘటన తరువాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరగడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ రోజు పరిస్థితిని గమనించిన తరువాత కర్ఫ్యూ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

స్థానికుల అండ‌దండలు :
కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ‌ల‌కు సానుభూతి ప‌రులుగా స్థానికుల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండ‌టంతో ముష్క‌రులు ఏం చేయాల‌న్నా వారి ల‌క్షాల‌ను టార్గెట్ల‌ను తేలిగ్గా అమ‌లు ప‌రుస్తున్నారు. ఇక్క‌డ ఉగ్ర సంస్థ‌ల‌కు స్థానికుల అండ‌దండ‌లు ఉన్నాయ‌న‌డానికి ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.  అయితే కొందరు దేశద్రోహులు మాత్రం ఈ ఘటనపై సంబరాలు చేసుకున్నారు. అదీ భారతీయులే అవడం సిగ్గుచేటు. దేశం నలుమూలల నుంచి వారిపై సానుభూతి, ఉగ్రవాద చర్యలపై ఆక్రోషం వెల్లువెత్తుతుంటే జైపూర్‌లోని నిమ్స్‌ యూనివర్శిటీలో చదువుతున్న నలుగురు కాశ్మీరీ అమ్మాయిలు (తల్వీన్‌ మంజూర్‌, ఇక్రా, జోహ్ర నజీర్‌, ఉజ్మా నజీర్‌‌) ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్నారు. దాడిని స్వాగతిస్తూ పార్టీ చేసుకున్నారు. ఫోటో తీసి.. పుల్వామా దాడిపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రతీకారం తీర్చుకున్నామని వాట్సాప్ స్టేటస్‌ పెట్టారంటే ఉగ్ర‌వాదుల‌కు ఇక్క‌డ ఎంత స‌పోర్టు ఉందో అర్దం అవుతుంది. అంతేకాకుండా  జమ్మూ కశ్మీర్ కు చెందిన ఓ యువకుడు పుల్వామాలో జరిగిన దాడిని సమర్ధించడమే కాకుండా ఉగ్రవాది అదిల్ అహ్మద్ ధార్ కు రిప్ బ్రో, ఇదే అసలైన సర్జికల్ స్ట్రైక్ అని ఫేస్బుక్ లో పోస్ట్ చేయ‌డం విశేశం. ఇలాంటి వాటిపై పాల‌కులు దృష్టి సారించి పెడ‌దోవ ప‌డుతున్న యువ‌త‌ను స‌క్ర‌మ మార్గంలో పెట్టేందుకు కృషి చేసిన‌ట్ట‌యితే ఇక ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌లు కాశ్మీర్‌లోనే కాకుండా దేశంలో మ‌రెక్క‌డా చేసే అవ‌కాశం వుంటుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.